సాయంత్రం పూట జాబ్ ముగించుకొని ఇంటికి వెళుతుంది ఓ అమ్మాయి… అది కాస్త ఇరుకుగా ఉన్న సందు, ఆ సందులోంచే ఆ అమ్మాయి ఇంటికి వెళుతుంది. ఎక్కడినుండో ఆ అమ్మాయిని ఫాలో అవుతున్న దొంగ అక్కడికి రాగానే ఎదురుగా బైక్ మీద వచ్చి బైక్ పక్కన ఆపి, చేతిలో కత్తి పట్టుకొని ఆమెను బెదిరించి ఆమె చేతిలోని హ్యాండ్ బాగ్ ను తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే ఆమెకు గుర్తుకువచ్చింది తన హ్యాండ్ బాగ్ లో 500 రూపాయలు నోట్లు రెండు, కాస్త చిల్లర , ఓ లిప్ స్టిక్ , రెండు సేప్లీ పిన్ లు, ఓ కర్చీఫ్ ఉన్నాయని.. .. అయితే దొంగతనం చేసిన హడావుడి లో ఆ దొంగ తన బైక్ ను అక్కడే వదిలి పారిపోయాడు.
ఆ అమ్మాయి వేరే ఆలోచనే చేయకుండా ఆ బైక్ ను స్టార్ట్ చేసి అక్కడి నుండి జంప్ అయ్యింది. తన బైక్ అక్కడే ఉందని లేటు గా గుర్తుతెచ్చుకున్న దొంగ అక్కడికి వచ్చే సమయానికి ఆమె బైక్ పై వెళుతుంది. పట్టుకోడానికి ట్రై చేశాడు, కానీ ఆమె ఫాస్ట్ ను అందుకోలేకపోయాడు. మనోడి తిక్క కుదిరింది. దొంగతనానికి వచ్చి 1000 కింద తన ఖరీదైన బైక్ ను సమర్పించుకోవాల్సి వచ్చింది.
Watch Video:( Wait 3 Sec For Video To Load)
ఆ అమ్మాయి దొంగకే షాకిచ్చింది.!! తిక్క కుదిరింది!!
Posted by Chantigadu on Thursday, October 15, 2015