అర్ధ్రరాత్రి అక్రమార్కులను, ఒంటరిగా పరుగులు పెట్టించిన ఆడ కలెక్టర్.

 

అది నిబద్దత అంటే, అది డ్యూటీ పై ఉన్నగౌరవం అంటే,  దైర్యసహాసాలకు నిలువెత్తు రూపం ఆ ఐఏయస్. ఇప్పుడు ఈమెను చూసి దేశం గర్విస్తోంది.  అర్థరాత్రి శివంగి లా ఇసుక మాఫియా పై  ఆమె చేసిన ఒంటరి పోరాటానికి రాష్ట్ర నలుమూలల నుండి మూకుమ్మడి  జైజైలు అందుతున్నాయ్…

వర్షిణి, వికారాబాద్ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి ఇసుక అక్రమార్కులు  కాగ్నా నదిలో అడ్డంగా తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారంతో ఇంటి నుండి బయలు దేరింది ఈ ఐఏయస్ ఆఫీసర్ . స్థానిక అధికారుల సహాయం తీసుకోలేదు! పోలీసులను వెంట తీసుకెళ్లలేదు! అర్ధరాత్రి ఒంటరిగా బైక్‌ మీద కాగ్నా నదికి వెళ్లింది.

sub collector

యాలాల మండలం బెన్నూరు, తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలను  అక్రమార్కులను పరుగులు పెట్టించింది. మొదట తన వాహనం పై వెళ్లిన వర్షిణి, తర్వాత ఇసుక మాఫియా కు అనుమానం రావద్దని తన వాహనాన్ని   తాండూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిలిపి.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లారు. లైట్ల వెలుతురు చూసిన ఇసుక అక్రమార్కులు, ట్రాక్టర్‌ డ్రైవర్లు.. పోలీసులు వచ్చారంటూ అక్కడి నుంచి పారిపోయారు. దాంతో సబ్‌ కలెక్టర్‌ వారిని వెంబడించి ,ఇసుక పట్టుకొని , పోలీసులకు అప్పగించారు. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.

varshini sub collector 2

అసలే మాఫియా కు అడ్డువచ్చారనే నెపంతో శవాలు కూడా దొరకకుండా చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలోనే అనేకం జరిగాయ్, అలాంటి సమయంలో కూడా జాతి సంపద రక్షించేందుకు అంతటి  సాహసానికి పూనుకున్న వర్షిణి కి అభినందనలు తెలుపుతున్నారు తెలుగు ప్రజలు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top