లైవ్ షోలో కొట్లాట…ఓంజీ బాబా చెంప చెల్లుమనిపించిన దీపాశర్మ!

అది జాతీయ స్థాయి ఛానల్…. అందులో  సాయంకాలం ఆద్యాత్మిక గురు రాధేమా మీద చర్చ మొదలైంది. చర్చ కోసం ముగ్గురు ప్రముఖులను పిలిచారు చర్చ నిర్వాహకులు… రాధేమా ఈ మధ్య కాలంలో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం, చాలా మంది ఆమె పై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయడం జరిగాయి.  అదేే అంశం పై చర్చ కొనసాగిస్తున్నారు. చర్చ రాధేమా అంశం నుండి,  చర్చలో పాల్గొన్న వ్యక్తుల  పర్సనల్ లైఫ్ లోకి వెళ్లింది. ఈ విషయంలో ఓంజీ బాబా…తనతో పాటు పాల్గొన్న  ప్రముఖ ఆస్ట్రాలజర్  దీపాశర్మ పర్సనల్ లైఫ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అప్పటి వరకు ఓపిక తో ఉన్న దీపాశర్మ చివర్లో సహనం కోల్పోయి ఓంజీ బాబా దగ్గరికి వెళ్లి ఆయన చెంపమీద ఒక్కటేసింది. తర్వాత ఆయన కూడా ఆమె పై చేయి చేసుకున్నాడు.  లైవ్ షో కి వచ్చి అసలు విషయాన్ని పక్కకు పెట్టి, వ్యక్తిగత విషయాల మీదకు చర్చను మళ్లించి… ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం…అది లైవ్ షో లో రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top