లావుగా ఉందని “రాశి ఖన్నా” కు ఫేస్ బుక్ లో కామెంట్స్ వస్తే ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో తెలుసా.?

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన రాశి ఖన్నా  అప్పట్లో కొంచెం బొద్దుగా ఉండేది..బొద్దుగున్నప్పటికీ అందరూ రాశిఖన్నా అందానికి,నటనకి ఫిదా అయ్యారు..కాకపోతే రాను రాను రాశి ఖన్నా బరువు భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో తన అభిమానులు కూడా అస్సలు ఇంత కేర్ లేదూ అనుకున్నారు…సోషల్ మీడియా వేధికగా కామెంట్స్ కూడా చేశారు..అయినా హీరోయిన్స్ అందరూ జీరో సైజ్ అంటూ వెంపర్లాడుతుంటే రాశి ఖన్నా మాత్రం ఎలా ఊరుకుంటుంది..అందుకే ఎవరూ ఊహించని స్థాయిలో సన్నబడి అందరికి షాక్ ఇచ్చింది…

వరుస అవకాశాలతో దూసుకుపోతుంది రాశికన్నా..తాజాగా రాశి, రవితేజతో టచ్ చేసి చూడు సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంతకుముందు బెంగాల్ టైగర్ లో హీరోయిన్ గా,రాజా ది గ్రేట్ లో ఒక పాటలో నర్తించిన రాశి ఇది ముచ్చటగా మూడోసారి..రవితేజ కంపెనీని ఎంజాయ్ చేస్తానంటున్న ఈ ముద్దు గుమ్మకి కామెడీ రోల్స్ చేయడం అంటే ఇష్టమంట..కానీ తెలుగులో హీరోయిన్ల నటనకు ఆస్కారం ఉన్న పాత్రలెక్కడ వస్తాయంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది..పనిలో పనిగా తన బాడీ గురించి కామెంట్ చేసినవారికి గట్టి సమాధానమే ఇచ్చింది..

రాశి ఏమన్నదో ఆమె మాటల్లోనే..నా గురించి ఏమాత్రం తెలియని ఓ అనామకుడు నా శరీరాకృతి గురించి చెడుగా మాట్లాడాడని నేను అస్సలు పట్టించుకోను. నేను వాడికి మహా అయితే అయిదారేళ్ళ నుంచి తెలుగు నాకు నేను 27 ఏళ్ల నుంచి తెలుసు. అందుకే ట్విట్టర్, ఫేస్ బుక్ లో నాగురించి కానీ.. నా పర్సనాలిటీ గురించి కానీ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే నేను అస్సలు పట్టించుకోను.ఎవరో ఏదో అంటున్నారనో లేక సినిమాలో అవకాశాల కోసమో నేను సన్నబడలేదు. నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా కోసం నేను సన్నబడ్డాను. అయితే.. నేను సన్నబడడం “తొలిప్రేమ” సినిమాలో డిఫరెంట్ స్టేజస్ క్యారెక్టర్స్ చేసేప్పుడు బాగా ఉపయోగపడింది.

Comments

comments

Share this post

scroll to top