కూతురు చ‌నిపోయినా ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ చేయడం మాన‌లేదు. ఓ వ్య‌క్తి నిండు ప్రాణాన్ని కాపాడాడు.!

పోలీసులు అన్నాక విధి నిర్వ‌హ‌ణ‌లో కొన్ని సార్లు అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అవి ఎలా వ‌స్తాయంటే… ఓ వైపు డ్యూటీ చేయ‌డమా, మ‌రో వైపు వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డ‌మా అనే అయోమ‌య స్థితిని తెచ్చి పెడ‌తాయి. అయితే ఇలాంటి స్థితిలో సాధార‌ణంగా ఎవరైనా డ్యూటీ పక్క‌న పెట్టి వ్య‌క్తిగ‌త ప‌నుల‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. కానీ ఆ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మాత్రం అలా చేయ‌లేదు. సొంత ప‌ని క‌న్నా డ్యూటీకే మొద‌టి ప్రాధాన్య‌త‌ను ఇచ్చాడు. ఓ వైపు ఇంటి నుంచి త‌న కూతురి చావు వార్త తెలిసినా మ‌రో వైపు డ్యూటీలోనే ఉన్నాడు. ఓ వ్య‌క్తి నిండు ప్రాణాన్ని కాపాడాడు.

అత‌ని పేరు భూపేంద్ర తోమ‌ర్‌. 57 సంవ‌త్స‌రాలు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు స‌హార‌న్‌పూర్‌లో ఉన్న బ‌డాగావ్ అనే ప్రాంతంలో ఓ వ్య‌క్తి క‌త్తిపోట్ల‌కు గుర‌య్యాడ‌నే వార్త పోలీసుల‌కు తెలిసింది. దీంతో అక్క‌డికి వెళ్లే డ్యూటీ తోమ‌ర్ పై ప‌డింది. అత‌నితోపాటు మ‌రి కొంద‌రు కానిస్టేబుల్స్ సంఘట‌న జ‌రిగిన స్థ‌లానికి వెళ్తున్నారు. అయితే స‌రిగ్గా స‌గం దూరం వెళ్ల‌గానే తోమ‌ర్ ఫోన్ రింగ్ అయింది. ఇంటి నుంచి కాల్ వ‌చ్చింది. త‌న కూతురు చనిపోయింద‌ని చెప్పారు. త‌న కూతురు జ్యోతి (27) న‌ర్సుగా ప‌నిచేస్తూ బాత్ రూంలో కుప్ప‌కూలి చ‌నిపోయింద‌ని తెలిపారు.

దీంతో తోమ‌ర్‌కు ఏం చేయాలో తెలియ‌లేదు. అయితే త‌న కూతురు ఎలాగూ చ‌నిపోయింది క‌దా, ఇక ఆమె వ‌ద్ద‌కు వెళ్లి ఏం ప్ర‌యోజ‌నం, క‌త్తిపోట్ల‌కు గురై చావు బ‌తుకుల్లో ఉన్న వ్య‌క్తి వ‌ద్ద‌కు వెళ్లి అత‌న్ని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తే అత‌ను బ‌త‌క‌వ‌చ్చు క‌దా అని తోమ‌ర్ ఆలోచించాడు. దీంతో తోటి కానిస్టేబుల్స్ చెబుతున్నా విన‌కుండా ముందుకే క‌దిలాడు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని హుటాహుటిన బాధితున్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించాడు. దీంతో అత‌ను బ‌తికాడు. ఇలా తోమ‌ర్ వ్య‌వ‌హ‌రించి ఓ నిండు ప్రాణాన్ని ర‌క్షించినందుకు అత‌న్ని అంద‌రూ అభినందిస్తున్నారు. సొంత కూత‌రు చ‌నిపోయినా, డ్యూటీయే ముఖ్య‌మైన భావించినందుకు గాను తోమ‌ర్‌ను అత‌ని ఉన్నతాధికారులు కూడా ప్ర‌శంసించి స‌న్మానం చేశారు. నిజంగా ఇలాంటి పోలీసులు మ‌న‌కు ఎక్క‌డో గానీ క‌నిపించ‌రు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top