కూరగాయలు ఎక్కువ తింటున్నారా.? అయితే ఎండాకాలంలో మంచిదో కాదో తప్పక తెలుసుకోండి!

ఎండాకాలం వ‌చ్చేసింది. ఎప్ప‌టిలాగే అందరూ అధిక వేడికి, ఉక్క‌పోత‌కు లోన‌వుతున్నారు. ఇక ఉద‌యం 10 గంట‌లు దాటిందంటే చాలు, సాయంత్రం 5 త‌రువాతే బ‌య‌ట‌కు వస్తున్నారు. ఎందుకంటే బ‌య‌ట అంత ఉష్ణోగ్ర‌త ఉంది మ‌రి. ఇంకా మే నెల రాక ముందే ర‌హ‌దారుల‌పై నిప్పులు కురుస్తున్నాయి. ఇలాంటి వేడి వాతావ‌ర‌ణంలో చాలా మంది త‌మ త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తుంటారు. అయితే ఆ మార్గాలతోపాటు కింద సూచించిన ఆహారాన్ని కూడా వేస‌విలో క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో శ‌రీరం వేడి బారిన ప‌డ‌కుండా చ‌ల్ల‌గా ఉంటుంది. దీంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌రి వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. శ‌న‌గ‌లు
నిత్యం శ‌న‌గ‌ల‌ను ఏదో ఒక విధంగా తీసుకోవాలి. ఇవి శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిస్తాయి. వేడి నుంచి కాపాడుతాయి. మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తాయి. వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

2. ఉసిరి
నిజానికి ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌లికాలంలో ల‌భిస్తాయి. కానీ ఇప్పుడ‌వి దొర‌క‌వు. అయినా దిగులు చెంద‌కండి. ఎందుకంటే మార్కెట్‌లో మ‌న‌కు ఉసిరి జ్యూస్ ల‌భిస్తుంది. దాన్ని రోజూ తీసుకున్నా చాలు శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

3. నెయ్యి
వేస‌వి కాలంలో నెయ్యిని ప్ర‌తి ఒక్క‌రు క‌చ్చితంగా తీసుకోవాలి. ఇది శ‌రీరంలో ద్ర‌వాల‌ను స‌మ‌తుల్యంలో ఉంచుతుంది. దీంతో ఎండ వేడి కార‌ణంగా డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. చ‌ర్మం త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన మాయిశ్చ‌ర్‌ను కోల్పోకుండా మృదువుగా ఉంటుంది.

4. అల్లం
అధిక వేడి ఉన్న‌వారికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉన్నాయి. అల్లం ర‌సం తీసుకుంటే వేస‌విలో క‌లిగే వేడిని త‌రిమికొట్ట‌వ‌చ్చు. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు. అల్లం టీ తాగినా చాలు అనుకున్న ఫ‌లితం ఉంటుంది.

5. కూర‌గాయ‌లు
ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌లను వేస‌విలో బాగా తినాలి. ఆలుగ‌డ్డ‌లు, బీట్‌రూట్‌, క్యారెట్లు, న‌ట్స్ ను కూడా సమ్మ‌ర్‌లో తీసుకోవాలి. ఇవి శ‌రీరంలో చ‌ల్ల‌దనాన్ని క‌లిగిస్తాయి. వేడి బారి నుంచి ర‌క్షిస్తాయి.

6. కొబ్బ‌రినీళ్లు
వేస‌విలో అధిక వేడి నుంచి ర‌క్షించుకోవాలంటే కొబ్బ‌రి నీళ్లు కూడా అందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రోజూ కొబ్బ‌రినీళ్ల‌ను తాగితే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

7. వాట‌ర్ రిచ్ ఫ్రూట్స్
పుచ్చ‌కాయ‌, ఖ‌ర్బూజ‌, బెర్రీలు, గ్రేప్ ఫ్రూట్స్‌, మామిడికాయ‌లు, పైనాపిల్ వంటి నీరు ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తినాలి. ఇవి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తాయి. శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల‌ను అందిస్తాయి.

8. తుల‌సి
నిత్యం తుల‌సి ఆకుల‌ను కొన్నింటిని న‌మిలి మింగాలి. ఇవి శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుద్ధి చేస్తాయి. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తాయి. వేడి నుంచి ర‌క్షిస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రుస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి.

Comments

comments

Share this post

scroll to top