ఆ పోలీస్ రియల్ హీరో .. ఆ తెగువకు సలాం.

ఆ పోలీస్… ఖాకీ బట్టలు వేసుకున్న హీరో, రియల్ హీరో, ఓ నిండు ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయని ధీరుడు. నీటిలో మునుగుతన్న వ్యక్తిని కాపాడడానికి 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ నుండి దూకిన  సహసశీలి. ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ కానిస్టేబుల్ తెగువ ముందు.. గర్వంగా ఓ శెల్యూట్ చేస్తే అతని ధీరత్వాన్ని కొంచమైన గుర్తించిన వాళ్లమవుతాము.

అసలు విషయంలోకి వస్తే.. గోదావరి కుంభమేళలో భాగంగా , గోదావరి జన్మస్థానమైన నాసిక్ కు  భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో  అమర్ధామ్ బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలోకి దూకాడు. ఇది చూసిన చాలా మంది అక్కడికి చేరుకొని తర్జనభర్జనలు పడుతున్నారు. చాలా మంది పోలీసులు కూడా వచ్చి లోపలికి వెళ్ళేందుకు వేరే మార్గాల వైపు పరుగులు పెడుతున్నారు.

సరిగ్గా అదే సమయంలో అక్కడికి పరుగు,పరుగున వచ్చిన మనోజ్ అనే కానిస్టేబుల్ అందరిలా అటు ఇటు చూడలేదు..వచ్చి రావడంతోనే నదిలో దూకి …ఆత్మహత్య చేసుకోడానికి నదిలో దూకిన అతనిని ఒడ్డుకు చేర్చాడు. నదీ ప్రవాహవం ఉదృతంగా ఉన్నప్పటికీ మనోజ్ చాలా చాకచక్యంతో అతనిని ఒడ్డుకు చేర్చాడు. మనోజ్ రావడం కాస్త ఆలస్యమయినట్టైతే…. ఆ వ్యక్తి జలసమాధి అయ్యేవాడు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top