కుమారి 21 F రివ్యూ & రేటింగ్( తెలుగులో…)

Cast & Crew:

నటీనటులు: రాజ్ తరుణ్, హేబాపటేల్, నోయల్, హేమ
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమెరా: రత్నవేలు
నిర్మాత: సుకుమార్

Story:

హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసిన సిద్ధూ (రాజ్ తరుణ్). సింగపూర్ లో ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. సిద్ధూ ఉన్న కాలనీకే మోడల్ అయిన కుమారి (హెబ్బాపటేల్) వస్తుంది. సిద్ధూని చూసి కుమారి మొదటిచూపులోనే ప్రేమలో పడి ప్రపోజ్ చేస్తుంది. సిద్ధూ తండ్రి తన తల్లితో ఉండకుండా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం సిద్ధూకు నచ్చదు. తన కాలనీలో ఉన్న తన ముగ్గురు ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్న కుమారితో మెల్లగా పరిచయం పెరిగి ఇద్దరూ స్నేహితులుగా మారతారు. అందరితోనూ క్లోజ్ గా, ఓపెన్ మైండ్ గా ఆలోచించే   కుమారి బిహేవియర్ ను దగ్గరగా గమనించిన సిద్ధూ, తన ఫ్రెండ్స్ మాటలు విని కుమారి ప్రేమను లైట్ తీసుకుంటాడు. కుమారిని దూరంగా ఉంచి, మరో అమ్మాయితో స్నేహం చేస్తాడు. తన తండ్రి గురించి ఓ నిజం తెలుసుకొని కుమారికి చెప్పి, కుమారిని ప్రేమిస్తున్న సంగతిని చెప్పాలనుకుంటాడు.  సిద్ధూ తన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏమిటి? కుమారికి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. సిద్ధూ ఫ్రెండ్స్ మాట విని ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు. కుమారి ముందు గతం ఏంటి ? చివరికి సిద్ధూ తన ప్రేమను దక్కించుకున్నాడా? అనేది మిగిలిన కథ.

 

PLUS POINTS:

  • రాజ్ తరుణ్ నటన
  • హెబ్బా పటేల్ గ్లామర్
  • దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్
  • స్టొరీ

MINUS POINTS:

  • సెకండాఫ్
  • స్లో నెరేషన్
  • మిస్సైన కామెడీ

Verdict: యూత్ ఆడియెన్స్ కు మాత్రమే పరిమితమైన బోల్డ్ సినిమా..

Ratting: (3.5/5)

Trailer: 

Comments

comments

Share this post

scroll to top