ఎన్నో ట్విస్ట్ ల నడుమ కర్నాటక సిఎంగా కుమారస్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈక్రమంలో ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనుకునే వారు ఆయన పేరును గుగూల్ లో సెర్చ్ చేస్తారు.కానీ ఆశ్చర్యకరంగా ఆయన గురించి కాకుండా ఆయన భార్య గురించి గుగూల్ లో వెతుకులాట ఎక్కువైంది. దీనంతటికి కారణం కుమారస్వామి భార్య హీరోయిన్ కావడమే.! దానికి తోడు కుమారస్వామిది లవ్ మ్యారేజ్ కావడం. ఇది ఇద్దరికీ రెండో వివాహం కావడం కూడా నెటీజన్లు అలా సెర్చ్ చేయడానికి కారణమైంది.
16 ఇయర్స్ కే సినిమాల్లోకి ప్రవేశించిన రాధిక కన్నడ, తమిల్ సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. ఈ సమయంలో కుమారస్వామి కన్నడ సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే రాధికతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అప్పటికే కుమారస్వామికి పెళ్ళై నిఖిల్ గౌడ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 2006 లో రాధికను రహస్యంగా పెళ్ళి చేసుకున్న విషయం 2010 లో అందరికీ తెలిసింది.
రాధికది సెకండ్ మ్యారేజే.
కుమారస్వామి తో రాధికకు సెకెండ్ మ్యారేజ్…14 సంవత్సరాల వయస్సులోనే రాధికను రతన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండేళ్ళకే రతన్ కు హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. దాంతో వైవాహిక జీవితం మీద విరక్తితో సినిమాలోకి ప్రవేశించిన రాధిక తర్వాత కుమారస్వామిని మ్యారేజ్ చేసుకున్నారు.
- రాధిక కుమారస్వామికి ఓ కూతురు ఆమె పేరు షమిక కుమారస్వామి…
- వీరిద్దరి మద్య ఏజ్ ఢిపరెన్స్ 26 ఇయర్స్. కుమారస్వామికి 58 ఏళ్లు, రాధికకు 31 ఏళ్లు.