సిన్సియర్ గా పనిచేసే “కలెక్టర్ ఆమ్రపాలి” కి వార్నింగ్ ఇచ్చిన “కేటీఆర్”..! కారణం ఏంటో తెలుసా..?

ఆమ్రపాలి..వరంగల్ జిల్లా కలెక్టర్..జనంలో కలిసిపోయేలా ఉండే యంగ్ అండ్ ఎనర్జిటిక్ కలెక్టర్..వేషధారణ దగ్గర నుండి మాటతీరు వరకు ప్రతిది ప్రత్యేకమే..అందరి కలెక్టర్లలా ఉండరు.అందుకే ఏం చేసినా వార్తల్లో వ్యక్తిలా ఉంటారు..కెటీఆర్ ఆగ్రహానికి గురై మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు..ఈ డైనమిక్ కలెక్టర్ ఎందుకు తడబడ్డారు.. ప్రతి విషయంలో డేర్ గా ఉండే ఈమె ఈ సారి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు..కెటిఆర్ ముందు ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నట్టున్న ఫోటోలు,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ..

వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో నిర్వహించిన నగర పాలక  సంస్థ సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారని, వాటి ప్రతిపాదనలెక్కడని ప్రశ్నించగా..సమాధానం చెప్పడానికి కలెక్టర్ ఆమ్రపాలి తడబడ్డారు… ఇంత దారుణంగా ఎలా పనిచేస్తున్నారని, ప్రజలకు ఏమని  సమాధానం చెబుతారంటూ .. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకుంటే ఎలా అని స్థానిక ఎమ్మెల్యే,మేయర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినయ్‌ను ఉద్దేశించి.. ‘నిధులు ఇస్తాం, లక్ష్యాలు ఇస్తాం.. ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి వచ్చి అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టాలా?’ అని అన్నారు. అధికారులనైతే బదిలీ చేస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతారని, కానీ ప్రజాప్రతినిధులు ఏమని సమాధానం చెబుతారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించడంతో అందరూ సైలెంటైపోయారు. నగర అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుంటే ఇక్కడ జరుగుతున్నది వేరని అన్నారు. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని మంత్రి మండిపడ్డారు.

తమ తప్పేం లేదంటూ కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులు వివరణ ఇస్తుండగా ఎంతో ఉత్సాహంతో వచ్చిన తాను.. పూర్తి అసంతృప్తితో వెనుదిరిగి వెళ్తున్నానని వ్యాఖ్యానించారు.కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలీ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Comments

comments

Share this post

scroll to top