ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ పై సంచలన కామెంట్స్ చేసిన “కేటీఆర్”..! కెసిఆర్ గారైతే ఏం చేస్తారో తెలుసా..?

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. భారత్ కు మొదటి మ్యాచ్ చిరకాలం ప్రత్యర్థితో అయిన పాకిస్తాన్ తో. దాదాపు రెండేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండటంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి దేశంలో ప్రతిఒక్కరు టీవీకి అతుక్కుపోయారు. మ్యాచ్ గెలవగానే మనం ఎలా సంబరపడతామో అందరికి తెలిసిందే. అయితే సెలెబ్రిటీలు కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తారా?. మనలాగే ఎంజాయ్ చేస్తారా.? ఈ ప్రశ్నకు ట్విట్టర్లో ఒకరు ఏకంగా మన ముఖ్యమంత్రిగారి కొడుకు “కేటీఆర్” గారిని అడిగారు..! మరి ఆయన ఏం చెప్పారో చూడండి!

అన్ని మ్యాచ్ లు అయితే చూడరు. భారత్ – పాక్ అంటే మాత్రం కచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తారంట. పాక్‌పై విజయం సాధించగానే భళా భారత్‌ అన్నట్లుగా ఆయన సందడి చేస్తారని ఆయన తనయుడు కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

అంతే కాకుండా కేటీఆర్ గారు ఒకప్పుడు ద్రావిడ్ ఫ్యాన్ అని తెలిపారు. కోల్కత్తాలో ఆస్ట్రేలియాపై లక్ష్యం కొట్టిన 280 ఇన్నింగ్స్ కేటీఆర్ గారికి బాగా ఇష్టం అంట!

 

 

Comments

comments

Share this post

scroll to top