ఒక గంట ఐస్ క్రీం అమ్ముతే వందల్లోనో, వేలల్లోనే వస్తుంది..! కానీ “కేటీఆర్” గారు గంట సేపు ఐస్ క్రీం అమ్మి ఏకంగా లక్షల్లో సంపాదించారు. అది ఎలా సాధ్యం..? అసలు కేటీఆర్ గారు “ఐస్ క్రీం” ఎందుకు అమ్మారు..?
ఈ నెల 27న వరంగల్‌లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం ‘గులాబీ కూలీ’దినాల పేరుతో మంత్రి కె.తారక రామారావు శుక్రవారం కుత్బుల్లాపూర్ సుచిత్ర సమీపంలో ఉన్న లాస్‌వేగాస్‌లోని ‘ది టీ ప్లానెట్’లో కోల్డ్ కాఫీ తయారు చేశారు. అలాగే రాక్స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్లో ఐస్‌క్రీమ్‌లు అమ్మారు. దీంతో సంకీత్రెడ్డి, సుధీర్‌రెడ్డి కూలి పనులు చేసిన మంత్రి కేటీఆర్‌కు రూ.1 లక్ష అందజేశారు.
నిజాంపేటకు చెందిన టీఆర్ఎస్ నేత కొలను శ్రీనివాస్‌రెడ్డి ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి రూ..1 లక్ష అందజేయగా, ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఇలా ఒకేరోజు కుత్బుల్లాపూర్‌లో రూ. 7 లక్షలు కేటీఆర్ పోగుచేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన చర్యలతో ప్రజలను ఆకట్టుకుంటూ ఉన్నారు మన కేటీఆర్ గారు.
Watch Video Here: