ఐపీఎల్ టిక్కెట్లు ఇప్పించండి అని ఓ యువకుడు అడిగితే…కేటీఆర్ ఇచ్చిన రిప్లై హైలైట్.! చూస్తే నవ్వాపుకోలేరు!

ఇండియ‌న్ క్రికెట్ ప్రేమికుల‌కు ఐపీఎల్ ఫీవ‌ర్ ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఏటా దాదాపుగా రెండు నెల‌ల పాటు జ‌రిగే ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. సాయంత్రం అవుతుందంటే చాలు.. హాట్ స‌మ్మ‌ర్ ను కూడా ప‌క్క‌న పెట్టి ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను కూల్‌గా ఎంజాయ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంటారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను టీవీల్లో చూసే వారు ఒకెత్త‌యితే కొంద‌రు వాటిని ప్ర‌త్య‌క్షంగా చూస్తేనే ఎంజాయ్ ఉంటుంద‌ని భావిస్తారు. అందులో భాగంగానే స్టేడియంలో మ్యాచ్‌ల‌ను చూసేందుకు కూడా చాలా మంది ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. మ‌ర‌లాంట‌ప్పుడు టిక్కెట్లు దొర‌క్క‌పోతే ఇక వారికి ఉండే ఆందోళ‌న అంతా ఇంతా కాదు. తీవ్ర‌మైన ఆవేద‌న చెందుతారు. అలా ఆవేద‌న చెందిన ఓ వ్య‌క్తి మంత్రి కేటీఆర్‌కు ఏమ‌ని ట్వీట్ చేశాడో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. జ‌నాలు ఏ చిన్న స‌మ‌స్య ఉంద‌ని ట్వీట్ పెట్టినా ఆయ‌న వేగంగా స్పందిస్తారు. వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు. అవ‌స‌రం ఉంటే ఆర్థిక స‌హాయం కూడా అందేలా చూస్తారు. అయితే ఈ విష‌యం తెలిసిన ఓ ఐపీఎల్ ప్రేమికుడు త‌న‌కు హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌కు మూడు టిక్కెట్ల‌ను ఉచితంగా ఇవ్వ‌మ‌ని కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ ప‌ట్ల కేటీఆర్ స్పందించారు.

ఐపీఎల్ మ్యాచ్‌కు ఉచితంగా మూడు టిక్కెట్ల‌ను ఇప్పించాల‌ని ఆ వ్య‌క్తి కేటీఆర్ కు ట్వీట్ చేయగా, కేటీఆర్ ఆ ట్వీట్ ప‌ట్ల స్పందించి మ‌రో ట్వీట్ పెట్టారు. నా వ‌ల్ల కాదు బాబూ.. అంటు సున్నితంగా త‌న అశ‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. అవును మ‌రి, ఏదైనా ఇత‌ర స‌మ‌స్య ఉంటే ప్ర‌భుత్వ ప‌రంగా స్పందించి ప‌రిష్కరించేందుకు య‌త్నిస్తారు కానీ.. మ‌రీ ఇలా టిక్కెట్ల‌ను అడిగితే ఎవ‌రైనా ఎలా స్పందిస్తారు. రిజ‌ల్ట్ ఇలాగే ఉంటుంది క‌దా. ఏది ఏమైనా ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ మాత్రం నెట్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top