సోషల్ మీడియాను షేక్ చేసిన ఫోటో…స్పందించిన “కేటీఆర్”!

బ్రతుకుతెరువు కోసం అతను తన గ్రామం వదిలి పట్నం వచ్చాడు. రోడ్డు పక్కన పుచ్చకాయలు అమ్ముకుంటున్నాడు. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ వెళ్లిపోవాలని చెప్పారు. “నా ఇల్లు గడవాలంటే ఈ పండ్లు అమ్ముకోవాలయ్యా! కొంచెం కనికరించండి!” అని పోలీసులను బతిమాలాడు ఆ వ్యాపారి. ట్రాఫిక్ పోలీసులు మాత్రం అస్సలు కనికరించలేదు సరికదా.. వెంటనే వెళ్లిపోవాలంటూ పుచ్చకాయలన్నింటిని నేలకేసి కొట్టారు. అన్నింటినీ విసిరేశారు.

“అయ్యా.. సారూ.. నాలుగు పుచ్చకాయలు అమ్మితేగానీ.. నాలుగు రూపాయలు మిగలవు.. ఇలా పాడుచేస్తే ఏం కావాలని” కాళ్లావేళ్లా పడ్డాడు అతను. అయినా వినని పోలీసులు.. అతను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లేవరకు ఇదే విధంగా పుచ్చకాయలను పాడుచేశారు. ఈ ఘటన  ఉప్పల్ లో జరిగింది.


అటుగా వెళుతున్న కొందరు ఈ సంఘటనను చూసి ఫోన్ లో ఫోటోలు తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరికొందరు ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు నేరుగా ట్విట్ చేశారు. పార్కింగ్ కు సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్ లో కూడా ఇలాగే వస్తువులు పడేస్తారా అంటూ కామెంట్స్ చేశారు.

 

ఫ్రెండ్లీ పోలీసింగ్ పై నెటిజన్లు సంధించిన ప్రశ్నకు వెంటనే సమాధానమిచ్చారు మినిస్టర్. ఈ ట్వీట్స్ కు స్పందించిన కేటీఆర్.. దాన్ని వెంటనే పోలీస్ బాస్ డీజీపీకి రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. సామాన్యులతో ఎలా ఉండాలో జూనియర్ ఆఫీసర్లకు కౌన్సెలింగ్ ఇవ్వండంటూ ట్వీట్ చేశారు. వీళ్ల సంగతి చూడండి అంటూ డీజీపీని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందనతో ఆయన ట్విట్టర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top