గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఉపాసన కొణిదెల, మెచ్చుకున్న కే.టీ.ఆర్..!!

ఉపాసన కొణిదెల..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఉపాసన ఇన్ఫర్మేషన్ అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ఎంతగానో సహాయపడ్డారు, పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఆమె మాట్లాడిన తీరు అమోఘం అని చాలా మంది మెచ్చుకున్నారు.

కే.టీ.ఆర్ కూడా.. : కే.టీ.ఆర్ సర్ ‘‘నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది’’ అని ట్విట్టర్ లో ట్వీట్‌ చేసారు ఉపాసన, ట్వీట్ లో అక్కడ పని చేసిన ఫొటోలను కొన్నింటిని షేర్ చేశారు. దానికి కే.టీ.ఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు, ‘మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు’ అంటూ కే.టీ.ఆర్, ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

ఇదే మొదటి సారి కాదు.. : ఉపాసన కొణిదెల తెలంగాణ గవర్నమెంట్ కి ఇది వరకు కూడా చాలా సార్లు సహకరించారు, ఆంధ్ర గవర్నమెంట్ తరుపున కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సామాజిక సేవ లో ఆమె ఎప్పుడు ముందుంటారు. చారిటీస్ ని రన్ చెయ్యడమే కాకుండా, మరికొన్ని చారిటీస్ కి ఫండ్స్ కూడా ఇస్తుంటారు.

రామ్ చరణ్ కూడా.. : ఉపాసన తో పెళ్లి తరువాత రామ్ చరణ్ చాలా మారిపోయాడు, ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో, అనాధ పిల్లల సంరక్షణ విషయం లో, ఇంకా చాలా చారిటీ యాక్టీవిటీస్ లో పాల్గొంటున్నారు, చారిటీస్ కి ఫండ్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు తరువాత జనాలకు అంతలా సేవ చేస్తుంది రామ్ చరణ్ ఏ. భార్య భర్తలిద్దరు సమాజం మేలు కోసం పాటుపడుతుండటం ఎంతో గర్వకారణం ఫ్యాన్స్ కి, కుటుంబానికి కూడా గర్వకారణమే.

 

Comments

comments

Share this post

scroll to top