“ఆపరేషన్ చేస్తే చూపొస్తుంది సార్” అని పోస్ట్ పెట్టాడు…చంద్రబాబు, లోకేష్, కేటీఆర్ లలో ఎవరు స్పందించారో తెలుసా.?

డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్న కేటిఆర్ మరొకసారి తన మంచి మనసుని చాటుకున్నారు.. మంత్రి కెటిఆర్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిందే..ట్విట్టర్లో ఒకసారి జోక్ పోస్ట్ చేసి కెటిఆర్ లో ఈ యాంగిల్ ఉందా అని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తే..ఈ సారి కెటిఆర్ పోస్ట్ చేసిన పోస్టు మాత్రం మానవత్వం ఉన్నవాళ్లని కరిగిస్తుంది…కెటిఆర్ యొక్క మంచి మనసు,సమస్యల పట్ల తను స్పందించే విధానం అర్దం అవుతుంది..ఇంతకీ కెటిఆర్ ఏం ట్వీట్ చేశారంటే…

రవి అనే బాబు పుట్టుకతో గుడ్డివాడు..తల్లిదండ్రలు ఎక్కడ కూలీపనుంటే అక్కడికెళ్లి పని చేసుకునే వలస కూలీలు..దాంతో రవిని తాత,నాన్నమ్మల దగ్గర వదిలివెళ్లారు.దాచుకున్న కొంత డబ్బుతో రవికి కంటి ఆపరేషన్ చేయిద్దామని చెన్నై తీసుకెళితే ఒక్కో కంటికి యాభైవేలు ఖర్చు అవుతుందని,మందుల ఖర్చు అదనం అని డాక్టర్లు చెప్పడంతో.. .రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో రవి కంటిచూపు కు సరిపడా డబ్బు సమకూర్చలేమని నిరాశగా వెనుదిరిగారు.దాతలు సాయం చేయాలని పేపర్లో వచ్చిన న్యూస్ విష్ణు అనే కుర్రాడు ట్విట్టర్ లో పోస్టు చేశాడు..ఎవరు రవికి హెల్ప్ చేస్తారు అంటూ కెటిఆర్ ని,నారా లోకేశ్ ని ఉద్దేశించి పెట్టిన పోస్టు కి వెంటనే కెటిఆర్ రవిని హైదరాబాద్ తీసుకురండి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అంటూ రెస్పాండ్ అయ్యారు…

దీంతో కెటిఆర్ ని నెటిజన్లు పొగుడుతున్నారు..సాయం చేయడం అనది తర్వాతి విషయం సాయం కోరడానికి వచ్చినవారికి ముందుగా మాటసాయం చేయడం పెద్ద విశేషం..ఈ రోజుల్లో అది కరువు అయింది..కానీ కెటిఆర్ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దాంతో ” మీరు నిజమైన లీడర్ “అంటూ  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు..నిజంగా రవికి కంటి చూపు వస్తే ఆ కుటుంబం కెటిఆర్ ని దేవుడిలా చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Comments

comments

Share this post

scroll to top