కృపామణి సూసైడ్ నోట్… వ్యభిచారం చేయాలని బలవంతం చేసిన పేరెంట్స్..అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్.!?

బయటకి వచ్చిన కృపామణి సూసైడ్ నోట్ తో మిస్టరీగా మారిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. పగో జిల్లా తణుకు మండలం వేల్పూర్ కు చెందిన కృపామణి ఆత్మహత్య విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలిసిందే. తనను తన తల్లీదండ్రులే బలవంతంగా వ్యభిచారం చేయంటున్నారని …ఆ అవమానాలు భరించలేక నే తనువు చాలిస్తున్నాని ఆమె రాసిన ఓ సూసైడ్ నోట్ తో పాటు వీడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చాయ్.

ఈ సూసైడ్ నోట్ ప్రకారం… తల్లీ,తండ్రీ, సోదరుడితో పాటు గుండాల సాయి శ్రీనివాస్ పేరును ప్రస్తావించింది. అతని కారణంగానే తాను చనిపోతున్నట్లు పేర్కొంది. ఇంక తనను మానసికంగా శారీరకంగా హింసిచిన విధానాన్ని కూడా తన రాసిన సూసైడ్ నోట్ లో తెలిపింది కృపామణి.

Read Suside Note:

letter

 

ఇదిలా ఉండగా..ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాక్ అయ్యే మరో నిజం బయటపడింది. కృపామణి తల్లిని విచారిస్తున్న పోలీసులకు ఆమె దగ్గర ఓ పెన్ డ్రైవ్ దొరికింది, దానిలో అన్ని అమ్మాయిల అశ్లీల చిత్రాలున్నాయ్. ఇవి ఎవరివి? ఇలా ఎంతమంది అమ్మాయిలను వీరు ఈ రొంపిలోకి లాగడానికి బ్లాక్ మెయిల్ చేశారు. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top