కృష్ణుడు పిరికివాడు కాదు (భారత్ కూడా అంతే), పురాణంతో భారత్-పాక్ ప్రస్తుతస్థితిపై వివరణ.

శ్రీకృష్ణుడికి మేనమామ కంసుడు. అతనికి ఇద్దరు కూతుళ్ళను ఇచ్చిన మామ మగధ రాజైన జరాసంధుడు. కంసవధ జరిగిన తర్వాత కక్షకట్టిన జరాసంధుడు మధురపై 17 సార్లు దండయాత్ర చేశాడు. కృష్ణుడిని హతమార్చడమే అతని ఏకైక లక్ష్యం. కానీ, దాడి జరిగిన ప్రతీసారి జరాసంధుడి సైన్యాలను అంతమొందించిన కృష్ణుడు , జరాసంధుడికి ఎదురు పడకుండా యుద్ధరంగం నుంచి పారిపోయేవాడు. ఇక్కడే చాలా మంది ఒక ప్రశ్న వేస్తారు. అంతటి వీరుడైన కృష్ణుడు ఎందుకు పారిపోయాడు? అతను పిరికి వాడా? జరాసంధుడిని ఏమీ చేయలేక పోయాడా? అనే ప్రశ్నలు గుప్పిస్తారు.
ముమ్మాటికీ కృష్ణుడు పిరికి వాడు కాదు. నిజమైన నాయకుడు. వ్యూహకర్త. తన ప్రజలకు ఎక్కువ ప్రాణ నష్టం జరుగ కూడదు. అమాయకులు బలి కాకూడదు అని ఆలోచించే వ్యూహాత్మక పలాయన మంత్రం పఠించే వాడు. చివరికి తన రాజధానిని కూడా ద్వారకకు మార్చేశాడు. అదును కోసం ఎదురు చూశాడు. చివరికి భీముడి చేత జరాసంధుడిని చంపించాడు. ఇప్పుడీ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరిస్తాను.

ఇక్కడ పాకిస్తాన్ జరాసంధుడి లాంటిది. ఉగ్రమూకలు జరాసంధుడి అనుచరుల వంటివి. భారత దేశం శ్రీకృష్ణుడి మధుర లాంటిది. మన పాలకులు కృష్ణుడి లాంటి వారు.ఇప్పటికిప్పుడు యుద్ధం అంటే ఎక్కువగా నష్టపోయేది భారత దేశమే. ఆర్ధిక వృద్ధిలో పాక్ కన్నా మనదేశం చాలా ముందంజలో వుంది. అనేక దేశాలు భారత్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. దేశం శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా వుంది.ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కు గౌరవ స్థానం వుంది. అటు చూస్తే పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా వుంది. ప్రభుత్వం పైన సైన్యం పెత్తనం నడుస్తోంది. ప్రపంచం పాక్ ను ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా చూస్తున్నాయి. బహుళ జాతి సంస్థలేవీ పెట్టుబడులు పెట్టడం లేదు.ఒక రకంగా ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ జరాసంధుడి లాంటిది. ఇలాంటి స్థితిలో యుద్ధం జరిగితే పాక్ కు పోయేదేమీ లేదు. కానీ, పచ్చని చేట్టులాంటి భారత జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దేశంలో అశాంతి రగులుతుంది. మూర్ఖుడిలాంటి పాక్ అణుయుద్ధానికి సైతం సిద్ధం అంటోంది. ఇదే జరిగితే ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరుగుతుంది.

addtext_com_mdizoteznzg2ntc

భారత ప్రగతి వందేళ్ళు వెనక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో మన వ్యూహకర్తలకు తెలుసు. మన్మోహన్ అయినా, మోడీ అయినా చెయ్యాల్సింది ఒక్కటే. తాత్కాలికంగా వెనకడుగు వెయ్యాల్సిందే. అది వ్యూహాత్మకమే. దౌత్య నీతితో పాక్ ను ఏకాకిని చేయటం మొదటి చర్య. భీముడి లాంటి అమెరికా ద్వారానే పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయటం, తద్వారా పాకిస్తాన్ ని కోలుకోలేని దేబ్బకోట్టటం. అప్పటి వరకు ప్రజలు అర్ధం చేసుకొని సంయమనంతో వ్యవహరించాల్సి వుంది.

Source: Shaik Sadiq Ali.

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top