ప్ర‌తి సినిమా ఓ జీవితానుభ‌వం – క్రిష్‌కు మాత్ర‌మే స్వంతం

రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి అంటే ఎవ‌రికీ తెలియ‌క పోవ‌చ్చు..కానీ క్రిష్ అనే స‌రిక‌ల్లా ట‌క్కున గుర్తుకు వ‌స్తాడాయ‌న‌. అతి త‌క్కువ కాలంలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన డైరెక్ట‌ర్ల‌లో అత్యున్న‌త‌మైన ద‌ర్శ‌కుడిగా వినుతికెక్కారు. కొంద‌రు ఎడా పెడా సినిమాలు తీస్తారు. ఇంకొంద‌రు అప్పుడ‌ప్పుడు తీస్తారు. కానీ క్రిష్ అలా కాదు..ఎక్కువ టైం తీసుకుంటారు. ఎక్క‌డికి వెళ‌తారో తెలియ‌దు..కానీ పుస్త‌కాల పురుగు. ప్ర‌తి రోజు చ‌దువుతాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే నిత్య విద్యార్థి. సాహిత్యం క్రిష్‌కు పంచ ప్రాణం.జీవితాన్ని కాన్వాస్‌లో బంధించాల‌ని అనుకోవ‌డం భ్ర‌మ‌. దానిని ఓ రంగుల ప‌త్ర‌హ‌రితంలా చూస్తే ..అద్భుతం అనిపిస్తుందంటారు ఆయ‌న‌. లైఫ్‌ను దాని పోక‌డ‌ను ..మ‌ధ్య‌లో జ‌రిగే స‌న్నివేశాల‌ను..సంఘ‌ట‌న‌ల‌ను గుర్తుకు తెచ్చేలా ..ఆలోచించేలా ..మ‌న‌సు బిగ‌ప‌ట్టేలా..గుండె బిగుసుకునేలా..చిన్న ప‌దాల్లో చెప్ప‌డం క్రిష్‌కే చెల్లింది.

krish

సినిమాకు ప్రాణం ద‌ర్శ‌కుడే. అత‌డే కెప్టెన్‌. డైరెక్ట‌ర్ అనే వ్య‌క్తికి స్వేచ్ఛ లేక‌పోతే..సినిమా పండ‌దు. మ‌న‌కు సంతృప్తిని ఇవ్వ‌దు. తెలుగు సినిమా మూస ధోర‌ణి లోంచి బ‌య‌ట ప‌డింది. కొత్త ద‌నం కోసం ప‌రిత‌పిస్తోంది. ఇటీవ‌ల అద్భుత‌మైన సినిమాలు వ‌చ్చాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, సుబ్ర‌మ‌ణ్య పురం..ఇలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయ్యాయి. స‌క్సెస్‌ను స్వంతం చేసుకున్నాయి. త‌మిళ సినిమా రంగం తెలుగు సినిమా రంగం కంటే ముందంజ‌లో ఉంటోంది.కొత్త వారిని ..కొత్త‌ద‌నాన్ని ఆస్వాదించ‌డంలోను..ప్రోత్స‌హించ‌డంలోనూ.. ముందంజ‌లో ఉంది. త‌లైవా యంగ్ డైరెక్ట‌ర్స్‌కు అవ‌కాశాలు ఇస్తున్నారు. ఇక్క‌డ వారికి అంత‌గా రావ‌డం లేదు. హీరో ఓరియంటెడ్ సినిమాల‌కు ప్ర‌యారిటీ ఎక్కువ‌. నాలుగు ఫైట్లు..ఐదు సాంగ్స్‌..నాలుగైదు డైలాగ్‌లు..రిలీజ్‌లు..యాడ్స్‌..ఇదీ మూస‌ప‌ద్ధ‌తిలోనే సాగుతోంది. కానీ త‌మిళ్‌..అలా కాకుండా క‌థ‌లు కావాల‌ని కోరుతున్నారు. కొత్త‌ద‌నం క‌నిపిస్తే చాలు..సైన్ చేసేస్తున్నారు. అలాంటి వారిలో ర‌జ‌నీ, విశాల్‌, విజ‌య్ ముందంజ‌లో ఉన్నారు.

ఇక క్రిష్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. గ‌మ్యంతో తెలుగు సినిమా త‌న వైపున‌కు తిప్పుకున్న రాధాకృష్ణ‌..ఏకంగా మ‌హానుభావుడు..న‌టసార్వ‌భౌముడు ..దివంగ‌త ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఆయ‌న స‌త్తాకు ద‌క్కిన గౌర‌వంగా భావించాల్సి ఉంటుంది. సాహిత్యాన్ని విస్తృతంగా చ‌దువుతాడు. దాని మూలాల లోకి వెళ‌తాడు. ఆయ‌న సినిమా ఓ ఆల్కెమీ..ఓ అద్భుతంలా ఉంటుంది.మ‌న జీవితం క‌నిపిస్తుంది. ఇదంతా క‌ష్ట‌ప‌డ‌టంలో..ఫీల్ కావ‌డంతో వ‌స్తుంది. ఇదే క్రిష్‌కు ఉన్న గొప్ప‌త‌నం..స్పెషాలిటీ. ప్ర‌తి సినిమాలో హృద‌యాన్ని హ‌త్తుకునేలా పాట‌లు ఉంటాయి. సాహిత్యం ఉంటుంది. సినిమా అంటే పాత్ర‌లు మాట్లాడ‌టం కాదు..జీవితాన్ని ఆవిష్క‌రించ‌డం అంటారు.

తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా ఎంట‌ర్ అయ్యాడు. అక్క‌డ సినిమాలు తీశాడు. 2008లో గాయం ఆయ‌న మొద‌టి సినిమా. 2010లో వేదం సినిమా తీశాడు. . సింగ‌ర్ సునీత పాడిన‌..ఎగిరిపోతే ఎంత బావుంటుంది..అన్న పాట ఆల్‌టైం హిట్ గా నిలిచింది. నంది అవార్డును, ఫిలిం ఫేర్ అవార్డును ద‌క్కించుకున్నాడు. నాజీల‌తో జ‌రిగిన యుద్ధాన్ని కంచె సినిమా తీశాడు. అదో మాస్ట‌ర్ పీస్‌.అది కూడా జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఇండియ‌న్ ప‌నోర‌మా కార్నివాల్ కాంపిటిష‌న్‌లో ప్ర‌శంస‌లు పొందింది. బాల‌కృష్ణ‌తో తీసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను స‌క్సెస్ చేశాడు. బాక్సాఫిస్ బ‌ద్ద‌లు కొట్టింది. మ‌ణికంఠ‌, ఝాన్సీ ల‌క్ష్మీబాయి ఎపిక్‌లు తీశాడు. ఇపుడు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడును తీసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. సాంగ్స్ రిలీజ్ చేశాడు. టీజ‌ర్‌కు ల‌క్ష‌ల్లో వ్యూవ‌ర్స్ వ‌చ్చాయి. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు తీశాడు. రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌కుడే కాదు..తాత్వికుడు..రుషి..యోగి..పుస్త‌కాల పురుగు..రీడ‌ర్‌..ఆలోచ‌నాప‌రుడు..ర‌చ‌యిత‌..భాషా ప్రేమికుడు..అన్నింటికంటే గొప్పనైన డైరెక్ట‌ర్‌. తెలుగు సినిమాకు అందిన అదృష్ణం..క్రిష్‌. రోజుకో పుస్త‌కం చ‌ద‌వండి. కానీ ఆప‌కండి. మ‌నం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. అవి ఇచ్చే స్వాంతన ఏవీ ఇవ్వ‌లేవు.

Comments

comments

Share this post

scroll to top