హీరోయిక్ డాక్ట‌ర్.! నా అనే వాళ్ళే వెన‌కాడిన‌చోట‌.. అన్నీ తానే అయ్యి 12 మందికి అంత్య‌క్రియ‌లు చేశాడు.!

నిఫా వైర‌స్ ….. ఒక్క‌సారిగా కేర‌ళ అంత‌టినీ షేక్ చేసింది. వ్యాధి సోకిన వారు సోకిన‌ట్టే చ‌నిపోయారు. అలా చ‌నిపోయిన వారి ద‌గ్గ‌రికి రావ‌డానికి వారి కుటుంబీకులు సైతం భ‌య‌ప‌డ్డారు. కార‌ణం ఆ మ‌హ‌మ్మారి వైర‌స్ ఎక్క‌డ త‌మ‌కూ సోకుతుందేమోన‌నే భ‌యం. అలాంటి ప‌రిస్థితుల్లో ముందుకొచ్చాడు ఈ డాక్ట‌ర్…నిఫా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన దాదాపు 12 మందికి అన్నీ తానే అయ్యి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు.

కోజీకోడ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ అయిన డాక్ట‌ర్ గోప‌కుమార్…ఇలా నిఫా వైర‌స్ సోకిన వారంద‌రి అంత్య‌క్రియ‌ల‌ను వారి వారి మ‌తాచారాల ప్ర‌కారం నిర్వ‌హించాడు. తొలుత ఓ 17 ఏళ్ళ యువ‌కుడు ఈ నిఫా వైర‌స్ కార‌ణంగా మృతిచెందాడు..అప్ప‌టికే ఆ కుర్రాడి త‌ల్లి కూడా ఇదే వైర‌స్ బారినప‌డి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న త‌రుణంలో…. బంధువులెవ్వ‌రూ ముందుకురాని సంద‌ర్భంలో…ఈ డాక్ట‌ర్ అన్నీ తానై ఆ యువ‌కుడి పార్థీవ దేహానికి హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాడు. ఈ అంతిమ యాత్ర‌లో…ఒక్క గోప‌కుమార్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ లేక‌పోవ‌డం బాధాక‌రం.

ఇప్ప‌టి వ‌ర‌కు కేర‌ళ‌లో…నిఫా వైర‌స్ కార‌ణంగా 17 మంది మ‌ర‌ణించారు. ఒక్క కోజికోడ్ ప్రాంతంలోనే 12 మంది ఈ వైర‌స్ కు బ‌ల‌య్యారు.!

Comments

comments

Share this post

scroll to top