బిగ్ బాస్- 2 విన్న‌ర్ కౌశ‌ల్, ర‌న్న‌ర్ గీతా మాధురి.

113 రోజుల బిగ్ బాస్ జ‌ర్నీ ముగిసింది. అంద‌రు ఊహించిన‌ట్టుగానే కౌశ‌ల్ బిగ్ బాస్ సీజ‌న్- 2 విన్న‌ర్ గా నిలిచాడు. గీతామాధురి ర‌న్న‌ర‌ప్ గా నిలిచారు. మొద‌టగా ఫైన‌ల్- 5 అంటూ అయిదుగురిని హౌజ్ లో ఉంచి… వారిలోంచి సామ్రాట్,దీప్తి ల‌ను ఎలిమినేట్ చేసి, త‌ర్వాత త‌నీష్ ను ఎలిమినేట్ చేశారు.ఫైన‌ల్ గా…హీరో వెంక‌టేష్ ఎంట్రీ త‌ర్వాత‌…. కౌశ‌ల్ ను బిగ్ బాస్ సీజ‌న్- 2 విన్న‌ర్ గా ప్ర‌క‌టించేశారు. టైటిల్ విన్న‌ర్ గా నిలిచిన కౌశ‌ల్ కు 50 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ తో పాటు ట్రోఫిని కూడా అంద‌జేశారు. అయిదుగురు ఫైన‌లిస్ట్స్ కు ఒక్కొక్క‌రికి 1 ల‌క్ష ను గిఫ్ట్ గా అందించారు. త‌న త‌ల్లి క్యాన్స‌ర్ తో చ‌నిపోయింద‌ని…బిగ్ బాస్ లో త‌ను గెలుచుకున్న డ‌బ్బులు క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఫ్యామిలీస్ కు అందిస్తాన‌ని చెప్పాడు కౌశ‌ల్.

 

కౌశ‌ల్ విక్ట‌రీకి 5 కార‌ణాలు:

1) సోష‌ల్ మీడియా ప్ర‌భావం.
2) చ‌క్ర‌వాకం, సూర్య వంశం సీరియ‌ల్స్
3) హౌజ్ మేట్స్ అంద‌రూ క‌లిసి అత‌న్నే టార్గెట్ చేయ‌డం.
4) హుందాత‌నం.
5) కౌశ‌ల్ ఆర్మీ.

కౌశ‌ల్ జీవిత విశేషాలు:

  • 1981 లో వైజాగ్ లో జ‌న్మించిన కౌశ‌ల్ …చిన్న‌త‌నం నుండే న‌టన‌పై ఇంట్ర‌స్ట్ చూపేవారు. తండ్రి రంగ‌స్థ‌ల న‌టుడు కావ‌డంతో…. త‌ను కూడా న‌ట‌నారంగంపై క్ర‌మంగా ఆస‌క్తి పెంచుకున్నాడు.
  • మోడ‌లింగ్ , సీరియ‌ల్స్ , సినిమాలు….ఇలా మూడు రంగాల్లోనూ త‌న‌దైన ముద్ర వేశాడు కౌశ‌ల్ .
  • మోడ‌లింగ్ కు సంబంధించి ద‌క్షిణ భార‌త‌దేశంలోనే …మొట్ట‌మొద‌టి మోడ‌లింగ్ ఎజెన్సీ ని 1999 లో లుక్స్ పేరుతో ప్రారంభించారు.
  • 1999లో మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లారు
  • రాజ‌కుమారుడు సినిమాతో వెండితెరకు ప‌రిచ‌యం అయ్యారు .

Watch Koushal Vijay Text tile Add Video :

Comments

comments

Share this post

scroll to top