ట్విస్ట్: సంగీత కేసులో సరికొత్త కోణం…భర్త నుండి 3 కోట్ల భరణం.? కాపురానికి రమ్మన్నా రాలేదంట.?

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు .చందానగర్ కు చెందిన సంగీతతో శ్రీనివాస్ రెడ్డికి నాలుగేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వారికి రెండేళ్ల పాప కూడా ఉంది..భర్త రెండొ పెళ్లి విషయం తెలిసిన సంగీత…భర్తను ప్రశ్నించటానికి ఇంటికి వెళ్తే…ఆమెపై దాడి చేశాడు. బందువులు చూస్తుండగానే సంగీతను ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాదు,జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు.ఇదంతా అక్కడే ఉన్నవారు సెల్ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసారు..  ఆడపిల్ల పుట్టినందుకే ఇంటి నుంచి గెంటేసినట్లు ఆరోపిస్తున్నారు బాధితురాలు సంగీత.  ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది.

మూడో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద పోరాటం చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతోపాటు ఆమె కుమార్తె ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఆమె చేపట్టిన న్యాయ పోరాటం నాలుగో రోజుకు చేరింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. నాలుగు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ధర్నా కొనసాగిస్తున్నా అత్తింటి వారి నుంచి స్పందన లేదు. అత్తామామలు లేదా ప్రభుత్వం తనకు హామీ ఇచ్చే వరకు ఇంటిముందే పోరాటం సాగిస్తానంటోన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇది ఇలా ఉండగా సంగీత కేసులో కొత్త కోణం వెలుగులోకొచ్చింది. భర్త శ్రీనివాస్ రెడ్డి నుంచి రూ. 3 కోట్లు భరణం కోరుతోందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఆర్ధిక పరమైన డిమాండ్లు తమ పరిధిలోకి రావని రాచకొండ సీపీ వెల్లడించారు. కాగా, సంగీత అత్తామామలను పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సంగీత.. వారిని అరెస్ట్ చేస్తే తనకు న్యాయం జరగదని, వారిని తన ముందుకు తీసుకురావాలని కోరుతోంది.

కాగా రెండోభార్య సంగీతను దూషించడమే కాక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చివేసి, ఆమె సోదరునిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో శ్రీనివాసరెడ్డిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…సంగీత ప్లాన్‌ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మూడున్నరేళ్లు అవుతుందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకపోయిందన్నాడు. అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలురకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సంగీతకు డబ్బు మాత్రమే కావాలని, తనతో కాపురం చేసేందుకు ఆమె ఇష్టపడటం లేదన్నాడు. తాను సంపాదించింది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదే అని చెప్పుకొచ్చాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు …తన దగ్గర ఉన్నాయని, త‍్వరలోనే వాటిని బయటపెడతానని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top