ఇవాంకా కాన్వాయ్ లో ఈ వాహనం ధర రూ.5కోట్లు… అది ఏం చేస్తుందో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్ వస్తోందని తెలిసినప్పటి నుంచి అంతటా ఒకటే చర్చ. ఆమె ఎలా వస్తారు..? ఎక్కడ ఉంటారు..? ఏం తింటారు..? ఇవే ప్రశ్నలు. వీటిపై పత్రికల్లో రకరకాల కథనాలు. స్పెషల్ ప్లైట్ లో వస్తారు. అమెరికా నుంచే వచ్చిన కాన్వాయ్ లో ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్తారు. దీని కోసం అమెరికా నుంచే హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న మూడు వాహనాలు వస్తున్నాయి. ఎవరికీ తెలియని ప్రత్యేక రూట్ లో అమెరికా నుంచి వాహనాల్లో ఇవాంక ట్రంప్ హోటల్ కు చేరుకుంటారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలకు అదే వాహనాల్లో వెళతారు. ఆమెను కలవడం ఎవరికీ అంత ఈజీ కాదు. ఇదంతా ఇవాళ ఉదయం వరకు జరిగిన ప్రచారం. కానీ అదంతా వట్టిదే అని తేలిపోయింది.

 ఇవాంక ట్రంప్ స్పెషల్ ప్లైట్ లో రాలేదు. ఎతిహాద్ ఎయిర్ లైన్స్ లో డెలిగేట్స్ తో పాటే ఆమె వచ్చారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు మన మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటెల్ ట్రైడెంట్‌ లో బస చేసేందుకు బయలుదేరారు. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు, మోడీ తో కలిసి మెట్రో ను పర్యవేక్షించారు.ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే..ఆమె భద్రత గురించి. ఇవాంకకు రక్షణ కల్పించడానికి మన సెక్యూరిటీ ఫోర్స్ మాత్రమే కాదు..అమెరికా నుండి కూడా సెక్యూరిటీ వచ్చింది. ఆమె వెంట వచ్చిన అమెరికా భద్రతా దళాలకు సహాయకారిగా ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన రూ.5కోట్ల విలువైన వెహికల్ పనిచేస్తోంది. ఇప్పుడు దానిపై ఆసక్తి నెలకొంది.

ఆమె ప్రయాణిస్తున్న వాహనం, ఆమె ఉండే ప్రదేశంలోకి.. ప్రమాదకర బ్యాక్టీరియా, వైర్‌స్ లు, విష, రసాయన పదార్థాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశిస్తే.. శరీరంలో ఎక్కించుకుని ఎవరైనా జీఈఎస్‌ సభా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే…? అత్యాధునిక పరికరాలతో పోలీసులు వాటిని క్షణాల్లో గుర్తించినా ఆ తర్వాత ఏం చేయాలి? ప్రాణ నష్టం కలుగకుండా వాటిని ఎలా నిర్వీర్యం చేయాలి? ఒక వేళ ప్రమాదం సంభవిస్తే రెస్క్యూ ఎలా చేయాలి? వీటన్నిటిపైనా క్షణాల్లో మెరుపు వేగంతో స్పందించే టీమ్ ఆమె వెంట ఉంటుంది. ఆ టీం కి సంబంధించిందే ఆ వాహనం. వారి పరికరాలు అందులో ఉంటాయి.

పోలీసు విభాగంతో పాటు జీఈఎస్‌, మెట్రో రైలు ప్రారంభోత్సవం వేళ భద్రత విషయంలో తెలంగాణ ఫైర్‌ విభాగం కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఉపయోగించని హజ్మత్‌ వాహనాన్ని జీఈఎస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే సైబరాబాద్‌ పోలీసులు పేలుడు, రసాయన పదార్థాలను గుర్తించడానికి అత్యాధునిక స్కానర్లను కొనుగోలు చేశారు. ఆ పరికరాలు గుర్తించిన వాటిని.. హజ్మత్‌ సహాయంతో సులువుగా నిర్వీర్యం చేయొచ్చు. హజ్మత్‌ను ఉమ్మడి రాష్ట్రంలోని ఫైర్‌ విభాగం 2009లో కొనుగులు చేసింది. దీని ధర రూ.5 కోట్లు. దేశంలోనే మొదట హజ్మత్‌ను కొనుగోలు చేసిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. జీఈఎస్‌ సందర్భంగా తొలిసారి హజ్మత్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో కెమికల్‌, బయోలాజికల్‌, రేడియో యాక్టివ్‌, న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి నలుగురు సిబ్బంది పనిచేస్తారు. ఆయా రంగాల్లో వారు నిష్ణాతులు. ఘటన తీవ్రతను గుర్తించి వారంతా రంగంలోకి దిగుతారు. హజ్మత్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ లు, విష, రసాయన పదార్థాలను నిర్వీర్యం చేయడానికి అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top