“వాట్సాప్” లో వచ్చిన ఈ కొత్త ఫీచర్ కి నెటిజెన్లు ఆనందభాష్పాలు కురిపిస్తున్నారు..! ఇక అపార్ధాలకు చోటుండదు..!

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ‌త కొంత కాలంగా వినియోగ‌దారుల‌ను ఊరిస్తూ వ‌స్తున్న ఫీచ‌ర్.. అదేనండీ.. మెసేజ్ రీకాల్‌. పంపిన మెసేజ్‌ల‌ను వెంట‌నే డిలీట్ చేసేందుకు ప‌నికొస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఏ మెసేజ్ పంపినా దాన్ని తిరిగి డిలీట్ చేసేందుకు అవ‌కాశం లేదు. అయితే మెసేజ్ రీకాల్ ఫీచ‌ర్ వ‌ల్ల మ‌నం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు కొంత టైం లిమిట్ ఉంటుంది. అయితే ఇదే ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్టింది.

వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్టిన మెసేజ్ రీకాల్ ఫీచ‌ర్ ఆండ్రాయిడ్ యూజర్లకు ల‌భిస్తోంది. ఈ యాప్‌కు చెందిన బీటా వెర్షన్ లో ఈ ఫీచ‌ర్ ల‌భిస్తోంది. వాట్సాప్ బీటా వెర్ష‌న్ ను కూడా యూజ‌ర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో మెసేజ్ రీకాల్ ఫీచర్ ను వారు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తాము పంపిన మెసేజ్‌లను డిలీట్ చేయవచ్చు. అయితే అందుకు పంపిన సమయం నుంచి 7 నిమిషాలపాటు వ్యవధి ఉంటుంది. ఆ సమయంలోనే ఆ మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. 7 నిమిషాలు దాటితే పంపిన మెసేజ్‌లను డిలీట్ చేయలేరు. ఎవరైనా ఒక యూజర్ మరో యూజర్‌కు తప్పుగా మెసేజ్ పంపితే వెంటనే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. అయితే సదరు మెసేజ్‌ను డిలీట్ చేస్తే దాని స్థానంలో This message is deleted అని కనిపిస్తుంది. అవతలి వారు మెసేజ్‌ను డిలీట్ చేసినా ఇలాగే యూజర్లకు కనిపిస్తుంది.

అయితే ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే యూజ‌ర్లు ఏదైనా మెసేజ్‌ను ప్రెస్ చేసి ప‌ట్టుకుంటే ట్రాష్ క్యాన్ సింబ‌ల్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంట‌నే మెనూ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అందులో 3 ఆప్ష‌న్లు ఉంటాయి. Delete For Me, Cancel, Delete For Everyone అని ఆప్ష‌న్లు కనిపిస్తాయి. వాటిల్లో మొద‌టి ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఆ మెసేజ్ డిలీట్ అవుతుంది. దాన్ని ఎవ‌రికీ క‌నిపించ‌కుండా చేయాలంటే 3వ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో యూజ‌ర్ సెలెక్ట్ చేసుకున్న ఆ మెసేజ్ డిలీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో వాట్సాప్ బీటా యాప్‌ను వాడేవారికి మాత్రమే లభిస్తున్నది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్ లభ్యం కానుంది. దాంతోపాటు ఐఫోన్, విండోస్ ఫోన్ యూజర్లకు కూడా మెసేజ్ రీకాల్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Comments

comments

Share this post

scroll to top