కాకతీయుల కోటగుళ్లకు సంబంధించిన చిత్రాలు,విశేషాలు.

కాకతీయుల పాలనలో నిర్మించిన గణపేశ్వర ఆలయంలో గణపేశ్వరునికి 800 సంవత్సరముల తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగి నిత్యపూజలు అందుకుంటోంది. గణపేశ్వరాలయం చుట్టూ మట్టికోట ఉండటంతో ఆలయానికి కోటగుళ్లు అనే పేరు వచ్చింది. గర్భాలయం చుట్టూ 22పరివార దేవాలయాలు, ఉత్తరాన కాటేశ్వరాలయం, దక్షిణం వైపు 60 స్తంభాల మంటపం, ఈశాన్యంలో రాత్రి ప్రాకారం ఉంటుంది. గర్భాలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. గణపేశ్వర ఆలయం 1262 సంవత్సరంలో నిర్మించిన గణపతి దేవ చక్రవర్తి పాలనలో నిత్య పూజలతో విరాజిల్లుతుండేదని చరిత్ర చెపుతోంది.అనంతరం కొనసాగిన పాలనలో తురుష్కరాజులు హిందూ దేవాలయాలపై చేసిన దాడుల్లో భాగంగా గణపేశ్వర ఆలయంపైకూడా దాడి చేశారు.

దీంతో అప్పటి నుంచి గణపేశ్వర ఆలయం 800 సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకుని పాడుపడ్డ దేవాలయంగా మారింది. ఎంతో అద్భుతమైన శిలాసంపదతో22 ఉప ఆలయాలతో ప్రకృతి అందాల మధ్య రామప్ప, వెయ్యి స్తంభాల దేవాలయాలను మరిపించే విధంగా ఉండే గణపేశ్వర ఆలయం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంటున్నసమయంలో స్థానికులు గత సంవత్సరం గణపేశ్వరునికి ప్రాణప్రతిష్ఠ చేసి నిత్య పూజలు జరుపుతున్నారు. గణపేశ్వరుడు నిత్య పూజలు అందుకోవడంతో భక్తులు, పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణపేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు, కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.ఎంతో అద్భుత శిలాసంపదతో పర్యాటకులను అబ్బురపరిచే గణపేశ్వర ఆలయాన్ని టూరిజమ్ స్పాట్‌గా గుర్తించి టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ప్యాకేజ్ టూర్‌లో వెయ్యి స్తంభాల దేవాలయం, వరంగల్ కోట, లక్నవరం, రామప్పలతోపాటు గణపేశ్వర ఆలయాన్ని కూడా చేర్చారు. గణపేశ్వర ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది.

12246786_861197833995209_6132161364629005636_n

12274238_861197920661867_9218116368316601984_n

12301549_861197970661862_7220400716912956487_n

12279044_861197933995199_1116643184610266488_n

Comments

comments

Share this post

scroll to top