తనపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ కి స్పందించిన “శివ కొరటాల”.! ఏమన్నారో తెలుసా..?

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది..ఎందరో దర్శకులు,హీరోలు,నటులు ఇందులో ఉన్నారని వారిలో కొందరి పేర్లు ప్రస్తావించింది శ్రీరెడ్డి శేఖర్ కమ్ముల,నాని,రమేష్ పుప్పాల ,శ్రీరామ చంద్ర,వైవా హర్ష ఇలా వారి పేర్లను ప్రస్తావించడమే కాదు అందులో కొందరి వాట్సప్ ఛాట్ స్క్రీన్ షాట్లను తన ఫేస్బుక్ ఫేజ్లో పోస్టు చేసింది..ఇదే క్రమంలో శ్రీరెడ్డి పవన్ ను తిట్టడం సర్వత్రా వ్యతిరేఖత రావడం,అలా నేనే తిట్టించానని వర్మ వ్యాఖ్యానించడం అది మరో కథ.అయితే ఇప్పటి వరకు శ్రీరెడ్డి ఆరోపించిన వాళ్లల్లో శేఖర్ కమ్ముల తప్ప ఎవరూ కూడా ఈ వ్యవహారం పై స్పందించలేదు.తాజాగా కొరటాల శివ స్పందించారు..

సినిమా ఇండస్ట్రీలో  లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలని గత కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆర్టిస్టులు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేశారు. వీరికి మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి..శ్రీ లీక్స్ పేరులో మొదట దర్శకుడు కొరటాల శివ పేరును శ్రీరెడ్డి సమాజ సేవ పేరుతో సినిమాలు తీసే స్టార్‌ డైరెక్టర్‌లు  ప్రస్తావించిన సంగతి తెలిసిందే…ఇంతకీ కొరటాల శివ ఏమని స్పందించారో తన మాటల్లోనే..

“తానేంటో తన చుట్టూ ఉన్న వారికి తెలుసు, అలాంటిది సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిలో తన పేరు కూడా రావడం ఆశ్చర్యం కలిగించింది. అలాంటి విషయాలకు, అలాంటి పనులుకు తాను పూర్తిగా వ్యతిరేకం.నాకు తెలిసిన వాళ్లకి, నా చుట్టు పక్కల వారిని కూడా నేను అలాంటివి ప్రోత్సహించను. నేను తీసిన నాలుగు సినిమాల్లో చాలా మందితో పనిచేశాను. నాకు ఆడ, మగ అనే తేడా లేదు. అందరి పట్ల చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎవరిని అసభ్యకరమైన వాఖ్యలతో కూడా పిలవను. అది ఏదో గాసిప్‌ లాగా ఉంటే నేను స్పందించే వాడిని కాదు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నా పేరు చాలా వైరల్‌ అవుతోంది. అందుకు నేను పర్సనల్‌గా స్పందిస్తున్నాను. నా లైఫ్‌లో ఆడవారికి చాలా ప్రాధాన్యత ఉంది. నా నుంచి ఇండస్ట్రీకి ఎలాంటి చెడు జరగకూడదని కోరుకుంటాను. అలాంటిది నా పేరు అందులో రావటం చాలా బాధాకరమ”ని కొరటాల శివ అన్నారు.

Comments

comments

Share this post

scroll to top