ఓ సారి తోసేస్తే చావలేదని..7 ఏళ్ల కూతుర్ని 4 అంతస్తులపైనుండి తోసేసి చంపేసింది ఆ తల్లి..! ఎందుకు?

సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ…. అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగర నుండే ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు..కానీ ఓ తల్లి ఇలా కూడా చేస్తుందా ముక్కున వేలేసుకునే ఘటన ఇది. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోరం ఇప్పుడు అందర్నీ నివ్వెరపరుస్తోంది. కన్ను కూతురిని అత్యంత కిరాతకంగా చంపేసింది ఆ తల్లి..

కాంచన్ సర్కార్,స్వాతి సర్కార్ కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు.పదేళ్ల క్రితం వివాహం అయిన వీరికొక పాప  ఉంది పేరు శ్రేయ.శ్రేయ మూగ, చెవిటి. కాంచన్ సర్కార్ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ గా మంచి హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వాతి ఓ ప్రైవేట్ స్కూల్ లో హిందీ టీచర్. కొంతకాలంలో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఏడాది కాలంగా భర్త కాంచన్ సర్కార్ కూడా వేరుగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఇంట్లోని కూతురి అనారోగ్యం, వైకల్యంతోపాటు వివాహ జీవితంలో గొడవలు స్వాతిని బాగా డిస్టర్బ్ చేసి   పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది స్వాతి.

స్వాతి తన కూతురు శ్రేయను అపార్ట్ మెంట్ మూడో అంతస్తు నుంచి కింద తోసేసింది.కిందికి వెళ్లి చూడగా శ్రేయ చనిపోలేదని, మళ్లీ శ్రేయ ని అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి పడేసింది. రెండో సారి ఆరు అంతస్తుల పైనుంచి పడటంలో స్పాట్ లోనే చనిపోయింది బేబీ శ్రేయ.ఆ తర్వాత ఏమీ తెలియనట్లు.. చక్కగా రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు అందరూ చూస్తుండగానే బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. విషయం చెప్పిన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు.. స్వాతిని ఓ కరెంట్ పోల్ కు కట్టేసి కొట్టారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోపంతో ఊగిపోతాం, ఆ తల్లిని తిడతాం.కానీ భర్త వదిలేసి,ఉద్యోగం లేకుండా ,కూతురి బాద్యత ఇలా ఒకదాని వెనుక ఒకటి అనేక సమస్యలతో అవతలి వారి ఎంత సతమతం అయ్యుంటారు,ఆ బాదలో ఏం చేస్తున్నారో తెలియని నిస్ఫ్రుహలో కన్నకూతురునే చంపుకున్న ఆ తల్లి ఎంత బాద అనుభవించిందో చూడం..దీనికి బాద్యురాలిని చేయాల్సింది పరిస్థితులను.మానవత్వం కనుమరుగవుతున్న ఎన్నో ఘటనలు మనుషులలో సున్నితత్వాన్ని దూరం చేస్తున్నాయి.ఆ పరిస్థితులను మనం ఎదుర్కొనాలి.

Comments

comments

Share this post

scroll to top