కుప్పకూలిన ఫ్లై ఓవర్….18 మంది మృతి!?

కోల్కతాలో  నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ హఠాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో  18 మంది  చనిపోయినట్ట సమాచారం.  కూలిన ఫ్లై ఓవర్  శిథిలాల కింద సుమారు 150 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.అదే గనక నిజం అయితే  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కోల్ కతా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ అది. దీని నిర్మాణం పూర్తైతే కోల్ కతాలోనే పొడవైనదిగా గుర్తింపును పొందనుంది. ప్లై ఓవర్ కూలిన ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమే కాక చాలా ఇరుకుగా ఉండే ప్రాంతం కావడంతో ప్రాణ నష్టం తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ అధికారులు, జాతీయ విపత్తు నివారణ బృందంతో పాటు స్థానికులు  సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిధిలాలను పూర్తిగా  తొలగిస్తే కానీ అసలు ప్రాణ నష్టాన్ని అంచనా వేసే అవకాశం లేదు. ఫ్లై ఓవర్ కూలిన వీడియోను చూస్తుంటేనే ఒళ్లు గగ్గురుపొడుస్తుంది.

Watch Video:

Watch Video:2:

Comments

comments

Share this post

scroll to top