కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేసారో తెలుసా..?

కోహీనూర్ ..భారతదేశం గురించి చెప్పుకునే అంశాల్లో కోహినూర్ ప్రస్తావన తప్పక ఉంటుంది.ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రంగా పరిగణించబడే 105 కారట్ల వజ్రము.105 కారట్లంటే  21.6 గ్రాములు ..అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. .ఇప్పటివరకూ ఇది చెంత చేరాక రాజులు రాజ్యాలు కోల్పోయారు,రాణులు తమ రాజ్యాలను విస్తరింపచేసుకున్నారు.దాంతో ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది..ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటీష్ వారికి దక్కినది.అసలు మొట్టమొదటి సారిగా ఈ వజ్రం దేశం దాటి ఎలా పోయిందో తెలుసా..దాని వెనుక ఇక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది .చదవండి.

1739 మే 12న సాయంత్రం.. దిల్లీలో సంబరంగా ఉంది. షాజహాన్‌బాద్, ఎర్రకోట నలువైపులా వేడుకలు అంబరాన్నంటాయి.పేదలకు షర్బత్, తినుబండారాలు, పండ్లు పంచుతున్నారు. ఫకీర్ల జోలె నిండా కాసులు నింపుతున్నారు.ఈ రోజు మొఘల్ రాజసౌధం 13వ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మహమ్మద్ షా తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఈ సారీ ఆయన తలపై రాజ మకుటం లేదు.దానికి ఒక కారణం ఉంది. అప్పటికి రెండున్నర నెలల కిందటే నాదిర్ షా ఆయన్నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.56 రోజులు దిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను ఆయన తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు.

శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జేబులూ ఖాళీ చేశాడు.ఈ నేపథ్యంలో.. దిల్లీలోని ఒక వేశ్య నూర్ భాయి, నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది.మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటుందని చెప్పింది. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఉప్పందించింది.నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతోమంది చక్రవర్తులకు చుక్కలు చూపించారు. ఎంతో సంపద దోచుకున్నారు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెబుతారు.ఆయన మహమ్మద్ షాతో “ఇరాన్ లో ఒక సంప్రదాయం ఉందన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పారు. ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా? అన్నారు. మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప వేరే ఏదీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు.నాదిర్ షా తన తలపాగా ఆయన తలపై పెట్టాడు. మహమ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. అక్కడితో  కోహీనూర్ చరిత్రకు తెరపడింది. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం హద్దులు దాటి ఇరాన్ చేరుకుంది..

తర్వాత పర్షియన్ రాజులు దీన్ని సొంతం చేసుకున్నారు.అలా ఎన్నో రాజ్యాలు తిరిగి చివరికి బ్రిటీష్ వారి చేతికి చేరింది.తర్వాత ఆ వజ్రాన్ని భారత్ కి తెప్పించాలని భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది..ఇంతకీ ఆ వజ్రం విలువ చెప్పలేదు కదూ ఆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బులో  ‘ప్రపంచం మొత్తానికి  రెండున్నర రోజులు పాటు  భోజనం పెట్టొచ్చట’

Comments

comments

Share this post

scroll to top