ఈ IPL సీజన్ కు దూరం కానున్న కోహ్లీ, రోహిత్, ధావన్.!?

టీమ్ ఇండియా లీడింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్..ఇక నుండి ఈ సీజన్ IPL మ్యాచ్ లు ఆడకపోవొచ్చు. ఎందుకంటే జూన్ లో జింబాంబ్వే తో జరగనున్న మూడు వన్డేలు ,మూడు టీ-ట్వంటీ మ్యాచ్ లను దృష్టిలో పెట్టుకొని BCCI ఈ ముగ్గురు లీడింగ్ బ్యాట్స్ మన్ కు  విశ్రాంతి నివ్వాలని భావిస్తుంది. BCCI ఆర్డర్స్ మేరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఈ సీజన్ IPL కు ఇక నుండి దూరంగా ఉంటారు. ముఖ్యంగా విరాట్, రోహిత్ లు గత ఆరు నెలలుగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. వీటన్నింటి దృష్ట్యా భారత  క్రికెట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.

drk-1443959796-800

విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకే IPL సీజన్లో  4 సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డ్ కూడా నెలకోల్పాడు.ఈ తరుణంలో కోహ్లీ బెంగుళూరు రాయల్స్ టీమ్ కు దూరమవ్వడం  ఆ టీమ్ కు చాలా కష్టం. కోహ్లీ ఆడితే బెంగుళరు గెలుపు తథ్యం అనే సెంటిమెంట్ తో ఉన్న ఆ టీమ్ కోహ్లీ లేకుండా ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. సన్ రైజర్స్ పరిస్థితి కూడా అంతే  వార్నర్ తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్ మన్ ధావన్ ఒక్కడే…అలాంటిది ధావన్ లేకుండా సన్ రైజర్స్ స్టోరీ ఎలా ఉంటుందో…..ముంబయ్ ఇండియన్స్ దీ అదే పరిస్థితి..ఇప్పటికే సెమీస్ బెర్త్ కష్టతరమైన టీమ్ కు రోహిత్ లేకపోతే అసాధ్యమే అని చెప్పొచ్చు.

IPL కంటే కూడా దేశం తరఫున ఆడడం ఎప్పటికీ ప్రత్యేకమే…అలాంటి తరుణంలో రెస్ట్ తీసుకోని జింబాంబ్వే లతో మ్యాచ్ లకు మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముగ్గురు టాప్ బౌలర్లకు కూడా విశ్రాంతినిచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది BCCI .ఎందుకంటే మన బలహీనత బౌలింగే కాబట్టి. Any How All The Best Team India In Zimbabwe Tour.

Comments

comments

Share this post

scroll to top