పాక్ అభిమానిని కాపాడడానికి రంగంలోకి దిగనున్న విరాట్ కోహ్లీ.!?

పాకిస్థాన్ కు చెందిన విరాట్ కోహ్లీ వీరాభిమాని ఉమర్ దరాజ్ ను రక్షించడానికి కోహ్లీ రంగంలోకి దిగనున్నట్లు  తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టినందుకు గాను పాకిస్తాన్ లో భారత జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్న ఉమర్ పాక్ ప్రభుత్వం అతనికి పదేళ్ళ జైలు శిక్ష విధించారు. అయితే ఇప్పుడు తన అభిమానిని రక్షించడానికి స్వయంగా కోహ్లీయే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే తన ఫ్యాన్ గురించి అన్ని వివరాలు కోహ్లీ ఆరా తీసాడని సమాచారం. త్వరలో విదేశాంగ శాఖ తోనూ, పాకిస్తాన్ ప్రభుత్వం తోనూ మాట్లాడి ఉమర్ కు విధించిన శిక్షను తొలగించాలని కోరనున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి.

2016_2$largeimg201_Feb_2016_091652267

ఉమర్ కూడా కేవలం కోహ్లీ మీద అభిమానంతో అతడు హాప్ సెంచరీ కొట్టాడన్న ఆనందంలోనే భారత జండాను ఎగురవేసినట్లు గతంలో తెలిపాడు. అయినా ఇందులో పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని చాలా మంది నెటీజన్లు కూడా అభిప్రాయపడ్డారు. స్వంత దేశ జాతీయజండాను అవమానిస్తే తప్పుకానీ పక్క దేశ జాతీయ జండాను గౌరవిస్తే తప్పెలా అవుతుందంటూ పోస్టులు కూడా పెట్టారు.

 

Comments

comments

Share this post

scroll to top