టీమ్ ఇండియాలో లుకలుకలున్నాయా? కోహ్లి సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ తో వన్డే సీరిస్ లో ఓడిపోయిన తర్వాత టీమ్ ఇండియాలో లుకలుకలు ఒక్కొక్కటటిగా  బయటపడుతున్నాయి. టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో అలజడి చెలరేగుతోందని టెస్ట్ కెప్టెన్ కోహ్లీ యే మీడియా ముందు చెప్పాడు. దీనిని బట్టే తెలుస్తోంది జట్టు లో ఐక్యత ఎలా ఉందో?

రెండో వన్డే తర్వాత ధోని ‘ నామీద నమ్మకం లేకుంటే నన్ను కెప్టెన్సీ నుండి తప్పించండి’  అని సంచలన వ్యాఖ్యలు చేయడం, తర్వాత ధోనికి మద్దతుగా అశ్విన్, రైనా లు మాట్లాడడం చకచకా జరిగిపోయాయి. కానీ తాజాగా కోహ్లీ మాటలతో మళ్లీ మ్యాటర్ వేడెక్కింది.

kohli and dhoni

డ్రెస్సింగ్ రూంలో అలజడి రేగుతోందని, జట్టులోని ఆటగాళ్లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేకపోతున్నారని కోహ్లీ తన ఆవేదనను బయటపెట్టాడు.  తమ ఆలోచనల్లో స్పష్టత లేని కారణంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయామంటూ సెలవిచ్చాడు. ‘నిర్ణయాలు తీసుకునే సమయంలోనే ఎంతో ఊగిసలాట నెలకొంది. అదే మైదానంలోనూ కనిపించింది’.  అని కుండబద్దలు కొట్టాడు.

kohli vs dhoni

అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది అని చెప్పడం, కోహ్లీ అబ్బే ఏం బాగాలేదని చెప్పడం. చూస్తుంటే టీమ్ ఇండియాలో  వర్గపోరు కొనసాగుతుందనే పుకార్లు వస్తున్నాయ్.

CLICK: త్వరలోనే మోడీకి పవన్ గిఫ్ట్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top