ర్యాం 'కింగ్'……… కోహ్లీ!!!

పిల్లి కళ్లు, బారు గడ్డం, అప్పుడప్పుడు అంపైర్లలతో వాగ్వాదాలు,  రేర్ గా  అనుష్కతో చక్కర్లు   ఇది టీమ్  ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి ఉపోద్ఘాతం….    పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా ఇతను  ఫీల్డ్ లోకి దిగాడంటే  ప్రత్యర్థి బౌలర్లు హడలిపోవాల్సిందే.. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఈ డిల్లీ కుర్రాడు. వన్డే  నాయకత్వానికి కూడా రెడీ అయిపోతున్నాడు.

వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఈ  టీం ఇండియా ఆటగాడు దుమ్ము దులుపుతున్నాడు.. అన్ని ఫార్మాట్లలో ముందు వరుసలో ఉన్నాడు.. ఫార్మాట్ ఏదైనా తన ప్రాతినిధ్యాన్ని మాత్రం ఘనంగా చాటుతున్నాడు . టి-ట్వంటీ లో బెస్ట్ బ్యాట్స్ మన్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, వన్డే ఫార్మాట్ లో 4 వ స్థానంలో ఉన్నాడు, టెస్ట్ ఫార్మాట్ లో 10 వస్థానంలో ఉన్నాడు. ఇండియా నుండి టెస్ట్ లో టాప్ టెన్ లోపు ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్ మన్ కోహ్లీ.

 

 

 

టాపర్స్ :

టెస్ట్ క్రికెట్ : కుమార సంగక్కర

sanga-640sl

వన్డే ఫార్మాట్ :  ఎబి డివిల్లర్స్.

abd

టి-ట్వంటీ: విరాట్ కోహ్లీ.

Jaipur: India's  Virat Kohli celebrates his century during  2nd ODI against Australia in Jaipur on Wednesday. PTI Photo by Atul Yadav   (PTI10_16_2013_000238b)

Jaipur: India’s Virat Kohli celebrates his century during 2nd ODI against Australia in Jaipur on Wednesday. PTI Photo by Atul Yadav (PTI10_16_2013_000238b)

ఇతర  ఇండియా ప్లేయర్స్ :

వన్డే ల్లో విరాట్ కోహ్లీ తో పాటు.. శిఖర్ ధావన్ 6 వ స్థానంలో, కెప్టెన్ ధోని 8 వ స్థానంలో కొనసాగుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్క టి-ట్వంటీ ఫార్మాట్లో అది కూడా 4 వ స్థానంలో అశ్విన్ కు తప్ప మరే భారత బౌలర్ కూడా ఏ ఫార్మాట్లో కూడా టాప్ టెన్ జాబితా లో లేరు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top