అగ్నిప‌రీక్ష‌లా మారిన ఐపీఎల్ – కోహ్లిపై ఫ్యాన్స్ ఆగ్ర‌హం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంత‌మైన క్రికెట్ ఆట‌గాడిగా ..డైన‌మిక్ బ్యాట్స్ మెన్‌గా..స‌క్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లికి ఐపీఎల్ టోర్నీ అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఎన్న‌డూ లేనంత‌గా పూర్ ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించ‌డం..జ‌ట్టును గ‌ట్టెక్కించ‌క పోవ‌డంతో నెటిజ‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో..ఇటు వ‌న్డే ఫార్మాట్‌లలో టాప్ వ‌న్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. గ్రౌండ్‌లోకి వ‌చ్చాడంటే ప‌రుగుల వ‌ర‌ద పారించే కోహ్లి..ప‌రుగులు చేసేందుకు ఇబ్బంది ప‌డుతున్నాడు. యంగ్ బ్లూ, డాషింగ్ స్టార్‌గా పిలుచుకున్న ఈ ఆట‌గాడు ఏ ఫార్మాట్‌లోనైనా ..ఎంత‌టి క్లిష్ట స‌మ‌యంలోనైనా సంయ‌మ‌నం కోల్పోకుండా ప‌రుగులు తీయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.

 

73 టెస్ట్‌లు, 213 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లి లెక్క‌లేన‌న్ని ప‌రుగులు చేశాడు. వ‌న్డేల‌లో 10 వేల ప‌రుగుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించాడు. 2008లో అండ‌ర్ 19 టోర్నీలో త‌న క్రికెట్ జీవితం ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి నేటి దాకా ప‌రుగులు చేస్తూనే ఉన్నాడు. క్రీజులో ఉన్నాడంటే సెంచ‌రీ సాధించాల్సిందే. ఐపీఎల్ వేలంలో కోహ్లిని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టుకు కెప్ట‌న్‌గా ఉన్నారు. ఈ జ‌ట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడితే అన్నీ ఓడి పోయింది. జ‌ట్టును ముందుండి న‌డిపించాల్సిన కోహ్లి తాను త‌క్కువ ప‌రుగుల‌కే వెనుదిర‌గ‌డం, జ‌ట్టులో భ‌రోసా నింప‌లేక పోవ‌డంతో గంపెడాశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అద్భుత‌మైన బ్యాట్స్ మెన్లు ఉన్న‌ప్ప‌టికీ బెంగ‌ళూరు జ‌ట్టు విజ‌యాల‌ను అందుకోలేక పోతోంది.

నాలుగు మ్యాచ్‌ల్లోను ఘోరంగా ఓడింది. విరాట్ బెంగళూరుకు 100 మ్యాచ్‌లు సార‌థ్యం వ‌హిస్తే కేవ‌లం 45 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆట‌గాళ్ల‌ను ఆడించ‌లేక పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం. చెన్నై టీంకు కెప్టెన్ గా ఉన్న ధోనీ ముగ్గురు స్పిన్న‌ర్ల‌ను వాడుతుంటే..కోహ్లి మాత్రం ఒక్క‌రితోనే ప్ర‌యోగాలు చేశాడు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు ఆట‌గాళ్ల‌ను ఉప‌యోగించుకోలేక పోతున్నారు. కీల‌క స‌మ‌యాల్లో మౌనంగా ఉండ‌డం ఓట‌మిని కొనితెచ్చుకుంటున్నారు. నెటిజ‌న్లు ఆడింది చాలు..ఆర్‌సీబీ జ‌ట్టు నుండి ప‌క్క‌న పెట్టండి..క‌నీసం 17 కోట్లు ఇత‌ర ఆట‌గాళ్ల‌పై పెడితే జ‌ట్టుకు మేలుజ‌రుగుతుందంటున్నారు. కోహ్లి అహంభావం వీడాల‌ని..జ‌ట్టు ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించాల‌ని కోరుతున్నారు. ఆయ‌న బ‌దులు వేరొక‌రిని ఆడించాల‌ని..త్వ‌ర‌లో ప్ర‌పంచ క‌ప్ వ‌స్తోంద‌ని ..దానిపై కోహ్లి దృష్టి సారిస్తే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

డివిలియ‌ర్స్‌కు అప్ప‌గిస్తే బావుంటుంద‌ని సూచిస్తున్నారు. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేసిన ఈ అరుదైన ఆట‌గాడు ఇపుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాట్‌తో రికార్డుల‌ను బ్రేక్ చేసిన త‌మ అభిమాన ఆట‌గాడు ఇలా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కొద్దిసేపు విశ్రాంతి ఇస్తే మేల‌ని యాజ‌మాన్యానికి సూచిస్తున్నారు. కోహ్లి త‌న‌కు తానుగా త‌ప్పుకుంటాడా లేక అహంభావాన్ని వీడ‌కుండానే టోర్నీలో ఇలాగే ఆడ‌తాడా అని ప్ర‌శ్నిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top