అనుష్క శ‌ర్మ క‌న్నా ముందు విరాట్ కోహ్లి గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌… వీరిద్ద‌రి గురించి కొత్త‌గా చెప్పేది ఏముంటుంది. గ‌తంలో చాలా నెల‌ల కింద వీరిద్ద‌రూ క‌ల‌సి తిరిగారు. ఒక‌రిపై ఒక‌రు మ‌న‌స్సు పారేసుకుని డేటింగ్ చేశారు. విరాట్ ఆడే మ్యాచ్‌ల‌కు అనుష్క శ‌ర్మ కూడా వ‌చ్చింది. అందులో భాగంగానే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌కు కూడా ఆమె వెళ్లింది. కానీ అనుకోకుండా ఆమె చూసిన మ్యాచ్‌లో కోహ్లి విఫ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. దీంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అనంత‌రం కొన్ని రోజుల‌కు ఇద్దరూ విడిపోక‌పోయినా ఎందుకో మ‌రి దూరంగా ఉంటున్న‌ట్టు క‌నిపించారు. కానీ ఈ మ‌ధ్యే మ‌ళ్లీ వారిద్ద‌రూ ఒకే వేదికపై క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అదేనండీ ఐఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లో..! దీపావ‌ళి రోజున గోవాకు, ఢిల్లీకి మ‌ధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్‌, అనుష్క శ‌ర్మ‌లు మ్యాచ్ జ‌రుగుతున్న వేదిక వ‌ద్ద క‌నిపించారు. గోవా ఫ్రాంచైజీ కో ఓన‌ర్ అయిన విరాట్ త‌న టీం జెర్సీని ధ‌రించ‌గా, అనుష్క శ‌ర్మ చుడీదార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న పాత ఘ‌ర్ష‌ణ‌లు పోయి ఇద్ద‌రూ క‌ల‌సిపోయిన‌ట్టుగానే క‌నబ‌డ్డారు. మ‌రి ఇంకేమిటి స‌మ‌స్య‌..? అని అనుకుంటున్నారా..? ఏం లేదండీ..! స‌మ‌స్య‌ల్లా ఇప్పుడు విరాట్ ఇంకో గ‌ర్ల్‌ఫ్రెండ్ గురించే..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

izabelle-4

izabelle-1
విరాట్ ఇంకో గ‌ర్ల్‌ఫ్రెండ్ అన్నాం క‌దా అని ఆమె ఈ మ‌ధ్యే అతనికి తార‌స‌ప‌డింద‌ని అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే ఆమె చాలా పాత గ‌ర్ల్‌ఫ్రెండ్‌. అనుష్క శ‌ర్మ క‌న్నా ముందు విరాట్ ఆమెతోనే డేటింగ్ చేశాడు. ఆమె పేరు ఇజాబెల్ లెయిట్‌. మీరు లాక్‌మీ యాడ్స్‌ను టీవీలో ఎప్పుడైన చూశారా..? అవును, అవే. వాటిలోనే ఇజాబెల్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఆమె బ్రెజిల్ మోడ‌ల్ క‌దా. మోడలే కాదు, ఆమె న‌టి కూడా. ప‌లు సినిమాల్లోనూ న‌టించింది. అయితే అది విరాట్‌ను వ‌దిలేశాక‌.

izabelle-2

izabelle-3
ఇజాబెల్‌, విరాట్‌లు కొంత కాలం పాటు డేటింగ్ చేశారు. అనంత‌రం విరాట్ త‌న కొత్త గ‌ర్ల్‌ఫ్రెండ్ అనుష్క శ‌ర్మకు షిఫ్ట్ అవ‌డంతో ఇజాబెల్ అత‌ని జీవితం నుంచి త‌ప్పుకుంది. కానీ ఇండియాను వ‌దిలి వెళ్లలేదు. పురానీ జీన్స్‌, సిక్స్‌టీన్ అనే సినిమాల్లో న‌టించింది. ఇప్పటికీ ఆమె ఇండియాలోనే ఉంటోంది. అయితే అందుకు వేరే కార‌ణం ఉంది. విరాట్ నుంచి తెగ‌తెంపులు చేసుకున్నాక ఈమె సిద్ధార్థ మ‌ల్హోత్రాతో డేటింగ్ చేస్తున్న‌ట్టు తెలిసింది. అంతే క‌దా మ‌రి..! సెల‌బ్రిటీలు అన్నాక ఇదంతా కామ‌న్‌. ఒక‌రిని విడిచిపెట్ట‌డం, మ‌రొక‌రితో డేటింగ్ లేదంటే స‌హ‌జీవ‌నం చేయ‌డం వారికి అల‌వాటేగా..!

Comments

comments

Share this post

scroll to top