దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న ఈవీడియోపై…కోహ్లీకి సైతం కోప‌మొచ్చింది.!!

ఈ వీడియో మ‌న‌దేశంలో పిల్ల‌ల‌కు చ‌దువును నేర్పించే విధానానికి అద్దం ప‌డుతుంది.! చ‌దువు రాకుంటే ఎందుకు ప‌నికిరాని వాడిగా ట్రీట్ చేసే ఈ స‌మాజంలో, మూడేళ్ళ వ‌య‌స్సులో……1,2,3 లు రాక‌పోతేనే ఇక వాడికి ప్యూచ‌రే లేద‌న్న రీతిలో….A,B,C,D లు నేర్వ‌క‌పోతే వాడు బ‌త‌క‌డ‌మే వేస్ట్ అన్న రీతిలో స‌మాజం ఎటో దూసుకెళుతుంది. !!చ‌దువు పేరుతో తెలియ‌ని భారాన్ని ప‌సిపిల్ల‌పై మోపుతున్న కార్పోరేట్ సంస్కృతికి …ఇలాంటి త‌ల్లిదండ్రులు తోడ‌వ్వ‌డం వ‌ల్లే…రేప‌టి పౌరులుగా ఎద‌గాల్సిన పిల్ల‌లు….ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న ఈవీడియోపై …ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ సైతం స్పందించాడు.ఫ్యార్ సే ప‌డావో ( ప్రేమ‌తో చ‌దివించండి) అని త‌న‌లోని ఫీలింగ్ ను బ‌య‌ట‌పెట్టాడు.! 3 ఏళ్ళ అమ్మాయిని ప‌ట్టుకొని ఓ తల్లి 1,2,3 లు నేర్పిన విధానం చూస్తుంటే…..ఎవ్వ‌రికైనా గుండె త‌రుక్కుపోతుంది.! ఆ ప‌సిపాప ప్రాధేయ‌ప‌డుతున్న విధానం చూసి మ‌న విద్యావ్య‌వ‌స్థ‌పై మ‌న‌కే అస‌హ్య‌మేస్తుంది.! ల‌ర్నింగ్ బై డూయింగ్ అంటూ ఆట‌పాట‌ల‌తో, చిన్న చిన్న కృత్యాల‌తో చ‌దువులు నేర్పుతూ ప‌క్క‌దేశాలు దూసుకుపోతుంటే…బ‌ట్టీ ప‌ట్టించే విధానాన్ని ఇంకా ఫాలో అవుతూ..ఇదిగో పసిపిల్ల‌ల‌ను ఏడ్పించే చ‌దువుల‌ను ఇంకా మ‌నం కొన‌సాగిస్తున్నాం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top