విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీలు వాడే బ్యాట్లలో ఎవరి బ్యాట్ ఎక్కువ ధరో తెలుసా..?

క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్‌మెన్ కొట్టే షాట్లను చూసి మనం ఎంజాయ్ చేస్తాం. ఆహా… ఓహో… అంటూ అరుస్తాం. కేకలు పెడతాం. అయితే ఓకే. ఇంకేంటి అంటారా..? ఏమీ లేదండీ.. అలా పవర్‌ఫుల్ షాట్లను ఆడేందుకు ఒక్కో బ్యాట్స్‌మెన్ ఒక్కో రకమైన బ్యాట్‌ను వాడుతాడు. ఎవరి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా వారు బ్యాట్లను వాడుతారు. ఇవి ధర చాలా ఎక్కువవే అయి ఉంటాయి. అయితే మీకు తెలుసా..? క్రికెట్ బ్యాట్ల విషయానికి వస్తే ప్రస్తుతం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వాడుతున్న బ్యాట్ కన్నా కీపర్ ఎంఎస్ ధోనీ వాడుతున్న బ్యాటే ఎక్కువ ధర కలిగిందట..! అవును, మీరు విన్నది నిజమే. దాని గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లి వాడుతున్న బ్యాట్ పేరు ఇంగ్లిష్ విల్లో. చాలా నాణ్యమైన కర్రతో దీన్ని తయారు చేస్తారు. దీంతో బ్యాట్ చాలా దృఢంగా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు వాడినా మన్నికగా ఉంటుంది. బరువు కూడా కరెక్ట్ సైజ్‌లో ఉంటుంది. ఎక్కువగా ఉండదు, అలా అని చెప్పి మరీ తక్కువ బరువు కూడా ఉండదు. సాధారణంగా ఈ బ్యాట్లు 8 నుంచి 14 ఏళ్ల వరకు పనికొస్తాయి. అయితే విరాట్ కోహ్లి వాడుతున్న బ్యాట్ ధర రూ.17వేల నుంచి రూ.23వేల వరకు ఉంటుంది. ఈ బ్యాట్ బరువు సుమారుగా 1100 నుంచి 1200 గ్రాముల వరకు ఉంటుంది.

ఇక ఎంఎస్ ధోనీ వాడే బ్యాట్ కూడా ఇంగ్లిష్ విల్లో కంపెనీకి చెందినదే. కానీ ఆ కంపెనీ ధోనీ కోసం బ్యాట్లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. వాటి పేరు స్పార్టన్ ఎంఎస్‌డీ 7. కేవలం ధోనీ కోసమే అతని పేరిటే ఆ కంపెనీ ఈ బ్యాట్‌లను తయారు చేస్తుంది. ఈ బ్యాట్‌లను 10 నుంచి 16 ఏళ్ల వరకు వాడవచ్చు. పాడుకావు. వీటి బరువు సుమారుగా 1180 గ్రాముల నుంచి 1250 గ్రాముల వరకు ఉంటుంది. ఇక ఈ బ్యాట్‌ల ధర రూ.24వేలకు పైనే ఉంటుంది. అయితే కోహ్లి తన బ్యాట్‌పై ఎంఆర్‌ఎఫ్ కంపెనీ స్టిక్కర్ వేసుకుంటాడు కదా.. అందుకు గాను ఆ కంపెనీ అతనికి ఏడాదికి రూ.8 కోట్లు చెల్లిస్తుంది. ఇక ధోనీకి స్పార్టన్ కంపెనీ రూ.6 కోట్ల వరకు చెల్లిస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top