ఓ వైపు టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మరోవైపు కోహ్లి మైదానంలో నిద్రించాడు. షాకింగ్‌..!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఎలాంటి తీవ్ర స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదభరితమైన వాతావరణంలో అక్కడి ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ కాలుష్యం సెగ ఢిల్లీలో తాజాగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌కు కూడా సోకింది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి మైదానంలో ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు పడుకున్నాడు. కింద చిత్రంలో అతన్ని చూడవచ్చు. దీంతో ట్విట్టర్‌లో జనాలు ఊరుకుంటారా ? కోహ్లి ఇలా నిద్రించడంపై వారు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

”Virat Soli (విరాట్‌ కోహ్లి పడుకున్నాడు)…”
”అది అనుష్క శర్మ చేసిన తప్పా..?”
”కోహ్లి అలా పడుకున్నప్పుడు కదిలితే ధోనీ స్టంప్‌ ఔట్‌ చేస్తాడు జాగ్రత్త..!”
”ఓహో… బాహుబలిని స్ఫూర్తిగా తీసుకున్నావా..? అవున్లే.. యోధులు ఎప్పుడూ ప్రశాంతత కోసం తల్లి ఒడిలో నిద్రిస్తారు..”
”ఢిల్లీ టూరిజం కోహ్లితో ఇలా పబ్లిసిటీ చేయిస్తుందన్నమాట..”
”రోజంతా ఏం చేస్తారు.. ఇలా పడుకుంటారా..?”

ఇదిగో ఇలా ఫన్నీ సెటైర్లు, జోకులు ఇప్పుడు ట్విట్టర్‌లో పేలుతున్నాయి. అయితే అందుకు కోహ్లి అలా నిద్రించడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే… ఢిల్లీలో కాలుష్యం ఉన్నప్పటికీ ఢిల్లీ స్టేడియంలో మాత్రం దాని తీవ్రత కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే స్టేడియంలో ప్రేక్షకులు, ఇతర మ్యాచ్‌ అఫిషియల్స్‌, ఇండియన్‌ ఆటగాళ్లు ఎవరూ కూడా కాలుష్యం ఉందని చెప్పి మాస్క్‌లు వేసుకోలేదు. కేవలం శ్రీలంక ఆటగాళ్లు మాత్రమే ఈ పని చేశారు. దీంతోపాటు వారు కాలుష్యం పేరు చెప్పి పదే పదే మ్యాచ్‌ను అడ్డుకోవాలని చూశారు. ఎందుకంటే వారు ఇప్పటికే ఈ 3వ టెస్ట్‌లో ఓడిపోయే దశలో ఉన్నారు. ఆల్రెడీ ఒక మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు. కనీసం ఇలా కాలుష్యం పేరు చెప్పి ఆటకు అంతరాయం కలిగిస్తే అయినా ఈ టెస్ట్‌ను డ్రా చేసుకోవచ్చని వారి ఉద్దేశం. అందులో భాగంగానే వారు పొల్యూషన్‌ పేరు చెప్పి పదే పదే ఆటకు అంతరాయం కలిగించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లి అలా మైదానంలోనే నిద్రించాడు. అదీ.. అసలు విషయం..!

Comments

comments

Share this post

scroll to top