భారత కెప్టెన్ “కోహ్లీ” కి కోచ్ “కుంబ్లే” కు మధ్య గొడవ..! ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలా అవ్వడానికి కారణం తెలుసా..?

భారత జట్టు సారధి “విరాట్ కోహ్లీ”కి భారత జట్టు కోచ్ “అనిల్ కుంబ్లే” కు మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్న వార్తను మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాము. కొత్త కోచ్ కోసం బీసీసీఐ చూస్తుంది అనే వార్త కూడా వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు ఇలా జరగడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పై ప్రభావం పడుతుంది అని బీసీసీఐ భావిస్తుంది. ఈ స‌మ‌స్య‌కు తెర‌దించేందుకు భార‌త మాజీ ఆట‌గాళ్లు బీసీసీఐ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యులైన స‌చిన్, గంగూలీ, ల‌క్ష్మ‌ణ్‌లు రంగంలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అసలు గొడవకు కారణం ఏంటి..? ఎప్పుడు మొదలైంది..? వివరాలు మీరే చూడండి!

కోచ్, కెప్టెన్ లకు మధ్య గొడవ మొదలైంది “ధర్మశాల క్రికెట్ స్టేడియం” లో. భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన చివ‌రి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ గాయంతో మ్యాచ్‌కు దూరంకాగా ఆయ‌న స్థానంలో చివ‌రి నిమిషంలో 11 మంది స‌భ్యుల జ‌ట్టులోకి చేరాడు చైనామెన్ బౌల‌ర్ “కుల్దీప్ యాద‌వ్‌“.
ఈ విష‌యం త‌న‌కు తెలియ‌కుండానే జ‌రిగడంతో కోహ్లీ కుంబ్ల‌పై ఫైర్ అవుతున్నారని సమాచారం.

 

Comments

comments

Share this post

scroll to top