“కొడుకుని ఉరిలా వేలాడదీసాడు…కూతుర్ని బెత్తంతో”.! తండ్రి ఇలా చేస్తుంటే తమ్ముడు ఫోన్ లో వీడియో, తల్లి మాత్రం!

తల్లిదండ్రులకు ఏమైంది..ఎందుకు పిల్లల్ని కొడుతున్నారు..కొట్టడం అంటే మామూలుగా కాదు రాక్షసంగా..పిల్లల్ని బుజ్జగిస్తూ చెప్తే వినరా..అల్లరి చేస్తే దెబ్బలే పరిష్కారామా..ఆ విధంగా కొడితే పిల్లలకు మనం ఏం నేర్పించినట్టు..రాక్షసప్రవృత్తిని మనమే దగ్గరుండి పిల్లలకు నేర్పిస్తున్నట్టు కదా.సహనం లేకపోవడమో,సముదాయించే తీరిక లేకపోవడమో కానీ తత్పలితంగా పిల్లలు కొంచెం అల్లరి చేసినా పట్టరాని కోపంతో విచక్షణ కోల్పోయి పిల్లలను దండిస్తున్నారు.

రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లా ఫుకియాథడ్ లో   కన్న కొడుకు, కూతురిని తల్లిదండ్రులు ఇంట్లోనే కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. అల్లరి చేస్తున్నాడని.. ఇంట్లో బట్టలు చిందరవందరగా పడేసి పాడు చేస్తున్నాడని  ,చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా  ఐదేళ్ల కొడుకు లలిత్ ను తీవ్రంగా హింసించాడు తండ్రి చైన్ సింగ్.ఇంట్లో దూలానికి తాడు కట్టి.. ఉరి వేసినట్లు వేలాడదీశాడు. గొంతుకు తాడు బిగుస్తుండటంతో  గిలగిలా కొట్టుకున్నాడు ఐదేళ్ల చిన్నారి లలిత్.మరోవైపు  అప్పటికీ కోపం తగ్గని తండ్రి.. బెత్తంతో బాదేస్తున్నాడు. ఆ తర్వాత..మూడేళ్ల కూతురు లాలాజవంతి ను చావగొట్టాడు. వీపుపై వాతలు పెట్టాడు. ఆ పక్కనే తల్లి ఉన్నా కనీసం వారించలేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని చైన్ సింగ్ తమ్ముడు రావత్ వీడియో తీశాడు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.మరొవైపు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది బాలల సంక్షేమ సమితి.

బాలల సంక్షేమ సమితి వాళ్లు  ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా… అక్కడ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.తల్లిదండ్రులు ఎలాంటి వారని ప పిల్లలను ప్రశ్నిస్తే.. తండ్రి ఎప్పుడూ ఇలాగే కొడుతుంటాడని,తల్లి ఏం అనదు అనే సమాధానం వచ్చింది..దాంతో తండ్రి చైన్ సింగ్ పై   పోలీసులు  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

watch video here:

https://www.facebook.com/febah.martin/videos/10208670916568883/

Comments

comments

Share this post

scroll to top