ఆ దుర్మార్గుడు తన కొడుకుని ఎలా కొట్టాడో తెలుసా.? తల్లి ఆపకపోగా వీడియో తీస్తుంది..!

పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు..కానీ మన సమాజంలో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు అన్ని ఇన్నీ కావు..ఎనిమిది నెలల పసికందుపై అత్యాచారం,ఆరేండ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన. ఉదయం లేవగానే పేపర్ తెరిచినా,టీవి పెట్టినా ఇలాంటివి ఎన్ని చూడాల్సొస్తుందో..ఎవరో ముక్కు మొఖం తెలియని వారు పిల్లల్ని వేధించడం వేరు, కన్నతల్లిదండ్రులే పిల్లల పట్ల కర్కషంగా ప్రవర్తిస్తే…ఇటీవల ఒక కుర్రాన్ని ఒక వ్యక్తి అత్యంత కృరంగా కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది..ఆ ఘటన తాలుకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

పదేళ్ల బాలుడిని విచక్షణా రహితంగా కొడుతున్న వ్యక్తి ఎవరో కాదు  ఆ బాలుడి తండ్రే..ఆ వీడియో షూట్ చేసింది మరెవరో కాదు ఆ బాలుడి తల్లి ..ఇంతకీ అంత కఠినంగా శిక్షించడానికి ఆ పిల్లాడు చేసిన అతి పెద్ద నేరం ఏంటంటే అబద్దాలు చెప్పడం..బెంగళూరు లోని కెంగెరి ప్రాంతానికి చెందిన ముప్పైఏళ్ల మహేంద్ర అనే వ్యక్తే  ఆ తండ్రి..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

దెబ్బలకు తాళలేక ఆ  పిల్లాడు ఆక్రందనలు పెడుతున్నా, ఇష్టానుసారం కొడుతూ, ఎత్తిపడేస్తూ  ఆవేశంతో ఊగిపోతున్న ఆ వీడియో చూసే మనకే ఆ కొట్టేవాన్ని నాలుగు తన్నాలనిపించింది..వాడిమీద కోపం వచ్చింది.అలాంటిది ఆ పిల్లాడి కన్నతల్లికి ఇంకెంత కోపం రావాలి.కోపం రాకపోగా  జరిగిన ఘటన మొత్తాన్ని ఆ మహాతల్లే వీడియో తీసింది.. ఏ తల్లైనా పిల్లాడిని తండ్రి కొట్టకుండా చూసుకుంటుంది.ఈ తల్లి అలా చేయకుండా సినిమా చూస్తునట్టు,ఎదురుగా ఏదో తమాషా జరుగుతున్నట్టు వీడియో తీయడం బాదాకరం.పిల్లలకు ఎవరినుండైనా అపాయం కలిగితే తల్లిదండ్రి రక్షిస్తారు,కానీ ఇక్కడ సొంత తల్లిదండ్రులే ఆ  పిల్లాడిని మానసికంగా.. శారీరకంగా తీవ్రంగా హింసించారు.. పిల్లాడి తల్లి ఓ మొబైల్ ఫోన్ టెక్నీషియన్‌కి ఫోన్ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

Comments

comments

Share this post

scroll to top