ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి శుభలేఖ ఎన్ని లక్షల్లో తెలుసా..? అందులో అంత స్పెషల్ ఏంటి..?

గ‌త కొద్ది నెల‌ల క్రితం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తన కూతురి పెళ్లిని రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టి జ‌రిపించాడు క‌దా. అప్ప‌ట్లో ఆ వార్త ప్ర‌ముఖంగా నిలిచింది. ఓ ద‌శ‌లో ఐటీ అధికారులు సోదాలు కూడా చేశారు. అంత డ‌బ్బుతో ఎలా పెళ్లి చేశారు ? ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ? అంటూ వారు సోదాలు నిర్వ‌హించారు. అంత‌టితో ఆ విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. కానీ.. ఇప్పుడు అది కాదు, ఆ పెళ్లిని త‌ల‌ద‌న్నే పెళ్లి మ‌రొక‌టి జ‌ర‌గ‌నున్న‌ది. అది ఎవ‌రి పెళ్లో తెలుసా..? ఇంకెవ‌రిది.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ కుమారుడిది. త్వ‌ర‌లోనే ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ట‌.

ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం ఇప్ప‌టి వ‌రకు బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఆ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇప్పుడీ వార్త బాగా వైర‌ల్ అవుతోంది. దీంతోపాటు ఆ పెళ్లికి సంబంధించిన శుభ‌లేఖ న్యూస్ కూడా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అదేమిటంటే.. ముఖేష్ అంబానీ త‌న కుమారుడి పెళ్లికి గాను ప్రింట్ చేయించ‌బోయే శుభ లేఖ ఖ‌రీదు ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.1.50 ల‌క్ష‌ల‌ట‌. ఏంటీ.. షాక‌య్యారా..! అవును, నిజంగా ఇది షాకింగే క‌దా.

అయితే స‌ద‌రు పెళ్లి కార్డును బంగారంతో చేయిస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్రమంలో దాని ఖ‌రీదుతో ఏకంగా ఓ ఐఫోన్ 10 ఫోన్‌నే కొన‌వ‌చ్చ‌ని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ పెళ్లి కార్డు ఖ‌రీదు వార్త నిజ‌మో కాదో తెలియ‌దు కానీ… ఇప్పుడీ వార్త మాత్రం బాగా వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా డ‌బ్బున్న వాళ్ల‌కు ఇవ‌న్నీ మామూలే క‌దా..! వారు ఖరీదైన శుభ‌లేఖలు ఏంటి.. అవ‌స‌రం అనుకుంటే అంతకు మించిన ప‌నులే చేయ‌గ‌ల‌రు. గాలిలో వివాహం చేసుకోగ‌ల‌రు. ఖ‌రీదైన భోజ‌నం పెట్ట‌గ‌ల‌రు. అవ‌న్నీ సామాన్యుల‌కు ఎలా వీలువుతాయి చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top