మీ పేరులోని A,E,I,O,U అచ్చులను లెక్కేసి చూడండి ! ఫైనల్ నెంబర్ తో మీరే టైపో తెలుసుకోండి.

న్యూమరాలజీ…ఇప్పుడు మంచి ట్రెండింగ్ టాపిక్,  పేర్లలో కొన్ని అక్షరాలను తొలగించడమో..లేక కొత్త అక్షరాలను కల్పించడమో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఓ టైప్ ఆప్ న్యూమరాలజీ గురించి చర్చిద్దాం. మీ పేరులోని ఇంగ్లీష్ అచ్చులు ( A,E,I,O,U)  ల ప్రకారం   మీ వ్యక్తిత్వాన్ని తెల్పుతుంది.  దీని కొరకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి.  వాటిని ఈవిధంగా ఫాలో అవ్వండి.

Interplay of numbers and attractive abstract forms on the subject of mathematics science computing modern technologies and numerology

Sterp:1
ఇంటి పేరుతో సహా మీ మొత్తం పేరును ఇంగ్లీష్ లో రాయండి.
Ex: Konidela Chiranjeevi.
Step:2
ఈ పేరులో ఉన్న అచ్చులను అంటే AEIOU లను మాత్రమే ఓ పక్కకు రాసుకోండి.
Ex : పై పేరులోని అచ్చులను సెపరేట్ గా రాస్తే.  _o_i_e_a__i_a__ee_i.
Step: 3
వరుస క్రమాన్ని బట్టి ఈ అచ్చులకు నెంబరింగ్ ఇవ్వాలి అంటే A=1, E=2, I=3, O=4, U=5.
Ex: పై పేరును బట్టి. 0=4, i=3 e=2 a=1 i=3 a=1 e=2 e=2 i=3.
Step:4 
అన్నింటిని కూడాలి.
Ex: పై పేరు ప్రకారం…. అన్నింటిని కూడితే……4+3+2+1+3+1+2+2+3=21.
Step:5
సింగిల్ నెంబర్ వచ్చే వరకు ఫైనల్ నెంబర్ ను కూడాలి.
Ex:2+1=3.
ఇప్పుడు ఫైనల్ గా వచ్చే నెంబర్ ను బట్టి వారి వ్యక్తిత్వాన్ని ఈ విధంగా అంచనా వేయాలి.
21drdeoq6ay38133mhqq
Numbers 
  • బర్త్ నంబర్ 1 అయితే పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  • బర్త్ నంబర్ 2 అయితే వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు.
  • బర్త్ నంబర్ 3 అయితే వీరు ఎల్లప్పుడూ సాహసాలను చేయాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటారు. ఇతరులను పాజిటివ్ దిశగా నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు.
  • బర్త్ నంబర్ 4 అయితే వీరిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ దాని గురించి వారికి తెలియదు. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అప్పుడప్పుడు విఫలమవుతుంటారు.
  • బర్త్ నంబర్ 5 అయితే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో ఓర్పు నశిస్తుంది. ఓర్పును జయించి కష్టపడితే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
  • బర్త్ నంబర్ 6 అయితే వీరు ఎల్లప్పుడూ తాము చేసే పనిలో కచ్చితత్వం కోరుకుంటారు. ఇది వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. అయితే వీరు ఇతరుల పట్ల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ వారికి సహాయం చేస్తారు. ఇది వారికి మరింత ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టుదలకు పోతుంటారు.
  • బర్త్ నంబర్ 7 అయితే వీరు మంచి ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మక మనసు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపూరితంగా ఉంటారు.
  • బర్త్ నంబర్ 8 అయితే వ్యాపారంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. వీరు మంచి పరిపాలన నైపుణ్యాలు కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంతో అది వారి కొంప ముంచే అవకాశం ఉంటుంది.
  • బర్త్ నంబర్ 9 అయితే వీరు సృజనాత్మకమైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇతరులకు వీరు ప్రేరణగా నిలుస్తారు. అయితే సొంత విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపరు.

Comments

comments

Share this post

scroll to top