11.44 లక్షల “PAN CARDS DEACTIVATE” చేసింది ప్రభుత్వం..! మీ కార్డు ఆక్టివ్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

పాన్ కార్డుదారులారా..! మీ పాన్ కార్డును ఆధార్‌కు లింక్ చేశారా..? చేయ‌లేదా..? అయితే మీకో షాక్ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దేశ వ్యాప్తంగా ఉన్న పాన్ కార్డుల్లో ఆధార్‌కు లింక్ కాని కొన్ని పాన్ కార్డుల‌ను తాజాగా డీయాక్టివేట్ చేశార‌ట‌. అవును, క‌రెక్టే. ఒక‌ట్లు, ప‌దులు కాదు, ఏకంగా ల‌క్ష‌ల్లో పాన్ కార్డుల‌ను డీయాక్టివేట్ చేశార‌ట‌. రాబోయే రోజుల్లో మ‌రిన్ని కార్డుల‌ను డీ యాక్టివేట్ చేస్తార‌ట‌. క‌నుక ఇప్ప‌టికైనా త్వ‌ర ప‌డండి. పాన్ కార్డును ఆధార్‌కు వెంట‌నే లింక్ చేయండి.

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 11.44 ల‌క్ష‌ల పాన్ కార్డుల‌ను డీయాక్టివేట్ చేసిన‌ట్టు తాజాగా తెలిసింది. ఇక చాలా కార్డుల‌ను డిలీట్ చేసింద‌ట కూడా. ఈ క్ర‌మంలోనే ఈ నెల 31వ తేదీ లోపు చాలా మందికి గ‌డువిచ్చింది. ఆ లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయ‌క‌పోతే డీయాక్టివేట్ చేస్తామ‌ని హెచ్చ‌రించింది. అయితే పాన్ కార్డుదారులు త‌మ కార్డు డీయాక్టివేట్ అయిందా, యాక్టివ్‌లో ఉందా అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఓ లింక్ ఇచ్చింది. అదేమిటంటే…

https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఎడ‌మ భాగంలో కింద ఉండే Know Your PAN అనే లింక్‌ను క్లిక్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే ఆప్ష‌న్ల‌ను నింపాలి. అప్పుడు ఆ ఆప్ష‌న్ల‌లో ఎంట‌ర్ చేసే మొబైల్ నంబ‌ర్‌కు పిన్ వ‌స్తుంది. దాన్ని త‌రువాత పేజీలో ఎంట‌ర్ చేసి క‌న్‌ఫాం చేయాలి. అప్పుడు పాన్ కార్డు వివ‌రాలు తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అక్క‌డే Remarks అనే సెక్ష‌న్ కింద యాక్టివ్ లేదా డీయాక్టివ్ అని క‌నిపిస్తుంది. యాక్టివ్ అంటే పాన్ కార్డు యాక్టివ్‌లో ఉన్న‌ట్టు. డీయాక్టివ్ అంటే పాన్ కార్డు డీయాక్టివేట్ అయిన‌ట్టు తెలుసుకోవాలి. ఒక వేళ యాక్టివ్‌లో ఉండి కూడా ఆధార్‌కు లింక్ చేయ‌క‌పోతే వెంట‌నే లింక్ చేసుకోండి. లేదంటే డీ యాక్టివేట్ అవుతుంది జాగ్ర‌త్త‌. ఇందుకు గడువు ఆగ‌స్టు 31వ తేదీ మాత్ర‌మే అనే విష‌యం గుర్తుంచుకోండి..!

>>>click here to check<<<

Comments

comments

Share this post

scroll to top