నిత్యం మనం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఒక్కోసారి చిత్రమైన ఆకారాలను చూస్తుంటాం. ఆకాశంలోని మబ్బుల్లో మనుషులు, దేవుళ్లు, చెట్లు తదితరాలను పోలిన ఆకారాలను, నీళ్లు, మట్టి, రాళ్లు, వృక్షాలు, ఆకులలో అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా కనిపించే ఆకృతులను మనం చూసి ఆశ్చర్యం చెందుతుంటాం. తాత్కాలికంగా ఏర్పడిన ఆకృతులే అయినా వాటిని చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది. కానీ మన శరీరంలోనూ అలాంటి ఆకృతులు ఉంటాయని మీకు తెలుసా? అవును, నిజంగానే ఉంటాయి. వాటిలో గోర్లు కూడా ఒకటి. ఇంతకీ వాటిపై ఏం ఆకారం ఉంటుంది? దాంతో ఏం జరుగుతుంది, అనేగా మీ డౌట్. అయితే దాన్ని తీర్చుకుందాం పదండి.
చేతి వేలి గోర్లపై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధచంద్రాకారంలో నెలవంకను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండదు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (lunula)’ అని పిలుస్తారు. ఈ లునులా మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్థం. అంటే నెలవెంక, చంద్రవంక అన్నమాట. అయితే ఈ లునులా దెబ్బతింటే మాత్రం ఆ గోరు పూర్తిగా నాశనమవుతుందట. ఒక వేళ ఏదైనా గోరును సర్జరీ చేసి తీసేసినా లునులా మాత్రం దెబ్బతినదట. అది ఎంత కాలమైనా అలాగే ఉంటుందట. ఈ క్రమంలో లునులా ఉండే ఆకారాన్ని, రంగును బట్టి మనం ఎదుర్కొంటున్న పలు అనారోగ్య సమస్యలను కూడా సులభంగా తెలుసుకోవచ్చట. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
- వేలి గోరుపై లునులా అసలు లేకపోతే వారు రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకోవాలి.
- ఒకవేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డయాబెటిస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి.
- లునులా మీద ఎరుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని తెలుస్తుంది.
- లునులా ఆకారం మరీ చిన్నగా, గుర్తు పట్టలేనంతగా ఉంటే వారు అజీర్ణంతో బాధపడుతున్నారని, వారి శరీరంలో విష, వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయాయని తెలుసుకోవాలి.
ఇక చివరిగా మరో విషయం. అయితే ఆరోగ్యానికి సంబంధించింది కాదు. అలంకరణకు చెందినది. గోరుపై నెయిల్ పెయింట్ వేసుకునే వారు పూర్తిగా ఒకే కలర్ కాకుండా లునులా వరకు వేరే కలర్ వేసుకుంటే బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుందట.
very nice
Vry nice good
Apart from Lunula, there will also be some white dots on the nails, can U pls explain what does it indicate.