అసలు ట్రాఫిక్ ఎంత ఉందో “గూగుల్ మాప్స్” కి ఎలా తెలుస్తుంది అనే డౌట్ వచ్చిందా.? కారణం మనమే తెలుసా.?

నేడు న‌గ‌రాల్లోనే కాదు, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ ట్రాఫిక్ స‌మ‌స్య‌లు జ‌నాల‌కు త‌ప్ప‌డం లేదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌కు వాహ‌న‌దారులు స‌త‌మ‌తం అవుతున్నారు. ఇక న‌గ‌రాల్లో అయితే ట్రాఫిక్ బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. సాధార‌ణంగా ర‌ద్దీ లేని రోడ్ల‌పై 1 కిలోమీట‌ర్ దూరాన్ని 1 నిమిషంలో వెళితే అదే ర‌ద్దీ ఉన్న రోడ్ల‌పై 1 కిలోమీట‌ర్ వెళ్లేందుకు 10 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అదీ.. నేటి త‌రుణంలో న‌గ‌రాల్లో వాహ‌నదారులు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి. అయితే.. ఇది స‌రే.. ట్రాఫిక్ అనేది ఎలాగూ త‌ప్ప‌దు. కానీ అది ఎక్క‌డ ఉంది, ఏ రూట్‌లో లేదు, ఏ రూట్‌లో వెళితే మన గ‌మ్య‌స్థానానికి త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చు.. అనే వివ‌రాలు ముందే మ‌న‌కు తెలిస్తే..? ఎలా ఉంటుంది.! అద్భుతంగా ఉంటుంది క‌దా. అవును, చాలా బాగుంటుంది. కానీ ఆ వివ‌రాలు తెలుసుకోవ‌డం ఎలా..? అంటే.. అందుకు గూగుల్ మ్యాప్స్ ప‌నికొస్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. గూగుల్ మ్యాప్స్‌తో మ‌నం లొకేషన్‌, రూట్ వివ‌రాలు మాత్ర‌మే కాదు, ఇప్పుడు ట్రాఫిక్ వివ‌రాలు కూడా తెలుస్తున్నాయి.

గూగుల్‌కు చెందిన మ్యాప్స్ అప్లికేష‌న్ ఇప్పుడు మ‌న‌కు అనేక ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తున్న‌ది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వెబ్‌.. ఇలా ఎక్క‌డ చూసినా మ‌న‌కు గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉంది. అయితే గూగుల్ మ్యాప్స్ అప్లికేష‌న్‌లో ట్రాఫిక్ అనే ఓ ఫీచ‌ర్ ఉంది. దాన్ని యాప్‌లోనైతే ఎడ‌మ వైపు పై భాగంలో అడ్డంగా ఉండే మూడు చిన్న గీత‌ల‌ను ఓపెన్ చేయ‌డం ద్వారా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. మూడు చిన్న గీత‌ల‌ను ట‌చ్ చేస్తే వ‌చ్చే మెనూలో ట్రాఫిక్ అనే ఆప్షన్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే చాలు, గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ ట్రాఫిక్ మ‌న‌కు క‌నిపిస్తుంది. అదే వెబ్‌లో అయితే గూగుల్ మ్యాప్స్ సైట్‌ను ఓపెన్ చేశాక అందులో ఎడ‌మ భాగంలో ఉండే మూడు గీత‌ల‌ను క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అప్పుడు వ‌చ్చే మెనూలో ట్రాఫిక్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే చాలు గూగుల్ మ్యాప్స్‌లో రియ‌ల్ టైం లైవ్ ట్రాఫిక్ అప్ డేట్ మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ లైవ్ అప్ డేట్స్ ఎలా క‌నిపిస్తాయి ? అనే మ‌రో సందేహం కూడా మీకు వ‌చ్చే ఉంటుంది. ఏమీ లేదండీ… ట్రాఫిక్ ఆప్ష‌న్‌ను మీరు ఎంచుకోగానే బ్యాక్ కు వ‌చ్చి మ్యాప్స్‌ను చూస్తారు క‌దా. అప్పుడు మ్యాప్స్‌లో రోడ్ల‌పై గ్రీన్ సింబ‌ల్ ఉంటే ట్రాఫిక్ లేన‌ట్టు. అదే ఆరెంజ్ ఉంటే లైట్ ట్రాఫిక్ ఉన్న‌ట్టు. రెడ్ క‌ల‌ర్ రోడ్ల‌పై కనిపిస్తుందంటే ట్రాఫిక్ బాగా ఉన్న‌ట్టు. అదే మెరూన్ క‌ల‌ర్ ఉందంటే ట్రాఫిక్ బాగా ఆగి ఉంద‌ని అర్థం. దీంతో ఆ రూట్ల‌కు మ‌నం ప్ర‌త్యామ్నాయ రూట్ల‌ను వెదుక్కుని వాటిల్లో ట్రాఫిక్ లేని రోడ్ల‌ను చూసుకుని ఎంచ‌క్కా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ల‌వ‌చ్చు. అయితే గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఈ ట్రాఫిక్ ఫీచ‌ర్ ఇప్పుడిప్పుడే చిన్న ప‌ట్ట‌ణాల‌కు కూడా విస్త‌రిస్తోంది. కానీ మెట్రో న‌గ‌ర వాసులు అయితే ఈ ఫీచ‌ర్‌ను ఇప్పుడే పొంద‌వ‌చ్చు. ఏది ఏమైనా గూగుల్ వారు అందిస్తున్న ఈ ట్రాఫిక్ అప్‌డేట్స్ ఫీచ‌ర్ భ‌లేగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top