సెక్సుకు సంబంధించిన ఏ టాపిక్‌ను తీసుకున్నా మన దేశంలో అదేదో మాట్లాడకూడని అంశంగా, అస్సలు దాని గురించి పట్టించుకోకూడదు, అటు వైపు చూడకూడదు అనే అంశంగా పరిగణిస్తారు. కానీ అలా ఉండడం వల్ల ఎంతో విలువైన జ్ఞానాన్ని మనం పొందలేం. ఆ అంశానికి చెందిన ఏ విషయంలోనైనా సరైన పరిజ్ఞానం ఉండకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం దాని గురించి నిశితంగా తెలుసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో దానికి సంబంధించిన ఓ టాపిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేమిటో కాదు, ఎవరైనా వ్యక్తులతో సెక్సులో పాల్గొన్నట్టు మనకు వచ్చే కలల గురించే.
నిజానికి అలాంటి కలలు రావడం గురించి చెడుగా అనుకోవాల్సిన పనిలేదట. వాటిని ఎవరైనా సరిగ్గా విశ్లేషించుకుంటే తమకు చెందిన మానసిక భావాల గురించి, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారనే దాని గురించి, దేని గురించి ఆలోచిస్తున్నారనే అంశాలను కూడా తెలుసుకోవచ్చట. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్టు మనుషులకు వచ్చే పలు రకాలైన సెక్సు కలలను గురించి వివరంగా తెలియజేశారు. మనుషులకు వచ్చే సెక్స్ సంబంధిత కలలు వాటి గురించిన అర్థాలను ఆయన విశ్లేషించారు. వాటిలోని సారం ఇదే…
- ఆడైనా, మగైనా తమ మాజీ భాగస్వామితో సెక్స్‌లో పాల్గొన్నట్టు వారికి కల వస్తే దాని అర్థం ఏమిటంటే… వారితో తమ బంధాన్ని పూర్తిగా తెంపేసుకోవాలని చూస్తుంటారట. ఆ క్రమంలోనే అలాంటి కలలు వస్తాయట.
- గర్భంతో ఉన్నట్టు కలలు వస్తుంటే అది శుభ సూచకమేనట. జీవిత భాగస్వాముల మధ్య బంధం బలపడుతున్నట్టు ఆ కలను అర్థం చేసుకోవాలట.
- ఎవరైనా జంట ప్రేమించుకుంటున్నట్టుగా కల వచ్చినా అది మంచిదేనట. ఏదో ఒక విషయంలో విజయం సాధించబోతున్నారనడానికి అది సంకేతంగా వస్తుందట.
- అపరిచిత వ్యక్తులతో రతి క్రీడలో పాల్గొన్నట్టు కల వస్తే జీవితంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయట.
- హోమో సెక్సువల్‌గా ఉన్నట్టు కల వస్తే కంగారు పడాల్సిన లేదు. అంత మాత్రం చేత మీరు హోమో సెక్సువల్ కాదు. కానీ అలాంటి కలల అర్థమేమింటే… మీ ఫ్రెండ్స్‌తో ఉన్న ఫ్రెండ్షిప్లో ఎవరితోనో మీరు ఇన్సెక్యూర్డ్గా ఫీలవుతున్నట్టు తెలుసుకోవాలి. అంతేకాదు, మీ ఫ్రెండ్‌కున్న ఏదో ఒక టాలెంట్‌ను మీరు అందిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి.
- ఎవరైనా మీకు ముద్దు పెట్టినట్టు కల వస్తే మీరు త్వరలో ఏదో ఒక గొడవలో ఇరుక్కోనున్నారని అర్థం చేసుకోవాలి.
- తరచుగా సెక్సుకు సంబంధించిన కలలు వస్తుంటే మీరు జీవితంలో అనేక నిర్ణయాలను తీసుకోకుండా వాయిదా వేస్తున్నట్టు తెలుసుకోవాలి. అంతేకాదు, అలాంటి నిర్ణయాలను చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్‌లో పెట్టినట్టు అర్థం చేసుకోవాలి.
- మీ ఊహా సుందరి లేదా సుందరుడితో సెక్స్‌లో పాల్గొన్నట్టు కల వస్తే అది కేవలం మీ అంతర్గత కోరిక మాత్రమేనట. దాన్ని పూర్తి చేసుకునేందుకే అలాంటి కలలు వస్తాయట.