KKR V/S RR లో గెలుపెవ‌రిది? #విశ్లేష‌ణ‌.

నేడు జ‌ర‌గ‌బోయే ఎలిమినేట‌ర్ మ్యాచ్ KKR V/S RR పోటీ ప‌డ‌నున్నాయి..ఓడిన టీమ్ ఇంటికి గెలిచిన టీమ్ ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో SRH తో పోటికి వెళ్ళ‌నున్న నేప‌థ్యంలో…అస‌లు ఏ టీమ్ కు గెలుపు అవ‌కాశాలెక్కువున్నాయి ..? దానికి గ‌ల కార‌ణాల‌పై ఓ లుక్కేద్దాం.!

ఎవ‌రు గెల‌వొచ్చు : KKR
ఎందుకు ? : RR తో పోల్చితే బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉండ‌డం.!

మ‌రింత లోతుగా…?

  • KKR మొద‌ట బ్యాటింగ్ చేస్తే క‌నీసం 170+ ర‌న్స్ చేయ‌గ‌ల‌దు…ప‌వ‌ర్ ప్లే లో ఆడియ‌న్స్ గ్యాల‌రీలోకి సిక్స్ ల‌ను అల‌వోక‌గా కొట్టగ‌ల న‌రైన్ ఉండ‌డం…మ‌రో ఓపెనర్ క్రీస్ లిన్ ఫామ్ లో ఉండ‌డం ఈ టీమ్ కు ఫ్ల‌స్… ప‌వ‌ర్ ప్లే ముగిసే వ‌ర‌కు న‌రైన్ ఉంటే…మ్యాచ్ దాదాపు KKR దే,
  • ఇక మిడిల్ ఆర్డ‌ర్ లో… రాబిన్ ఉత‌ప్ప‌, నితీష్ రానా లు కూడా ఉన్నారు…. ఇంకా ముఖ్యంగా క‌న్సిస్టెంట్  కెప్టెన్…దినేష్ కార్తీక్ తో పాటు భారీ హిట్ట‌ర్ అండ్రూ ర‌స్సెల్స్ కూడా స్కోర్ బోర్డ్ ను ప‌రుగులు పెట్టించ‌గ‌ల‌డు.
  • సొంత మైదానంలో ఆడ‌డం ఈ టీమ్ కు మ‌రింత ప్ల‌స్, పియూష్ చావ్లా,కుల్దీప్ యాద‌వ్, న‌రైన్ ల స్పిన్ ను ఎదుర్కోవ‌డం RR కు క‌ష్ట‌మే.!

RR కు సంజూ శాంస‌న్ నే కీల‌కం..జోరు మీదున్న జాస్ బ‌ట్ల‌ర్, బెన్ స్ట్రోక్స్ సొంత టీమ్ కు ఆడ‌డం కోసం ఇంగ్లాడ్ కు వెళ్ళ‌డంతో RR క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ర‌హానే కూడా అంత ట‌చ్ లో లేక‌పోవ‌డం ఈ జ‌ట్టును ఇబ్బంది పెట్టే అంశం, చివ‌రి మ్యాచ్ లో త్రిపాఠి ఇన్నింగ్స్ RR కు కాస్త సానుకూలాంశం..ఇక శ్రేయాస్ గోపాల్ స్పిన్, గౌత‌మ్ ఆల్ రౌండ్ ప్ర‌తిభ చూపితే కానీ ఈ టీమ్ మ‌రో మెట్టు ఎక్క‌డం అసాధ్యం. ఫైన‌ల్ గా KKR కు గెలుపు అవ‌కాశాలెక్కువ అనేది మా ప్రెడిక్ష‌న్.

NOTE: IPL లో ఏ క్ష‌ణంలో అయిన మ్యాచ్ ట‌ర్న్ అవ్వొచ్చు, ఒక్క ఓవ‌ర్ చాలు ఫ‌లితం తారుమారు అవ్వ‌డానికి, కాబ‌ట్టి ద‌య‌చేసి ఈ విశ్లేష‌ణ మీద ఆధార‌ప‌డి బెట్టింగ్ ల జోలికి వెళ్ళ‌కండి.!

Comments

comments

Share this post

scroll to top