మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఈ పండు..!

సోడియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, ఐర‌న్‌, పీచు ప‌దార్థం, జింక్‌, కాపర్‌, ఫొలేట్‌, విట‌మిన్ ఎ, సి, డి, కె1, బి12, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ, నిత్యం మ‌నం తినే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలివి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏయే పోష‌కాన్ని తీసుకుంటే ఎలాంటి ర‌కాల లాభాలు క‌లుగుతాయో దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే పైన చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు ఏదో ఒక ఆహార ప‌దార్థం తిన‌డం వ‌ల్ల ల‌భించేవే. కానీ అవ‌న్నీ ఒకే ప‌దార్థంలో ల‌భిస్తే..? దానికి మించిన అద్భుత‌మైన పోష‌కాహారం ఇంకేముంటుంది. అదిగో, అలాంటి ప‌దార్థ‌మే కివీ. కివీ పండు. న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండే కివీలు మ‌న ద‌గ్గ‌ర ఇప్పుడు విరివిగా ల‌భిస్తున్నాయి. డెంగీ వ‌చ్చిన వారు వీటిని ఇప్పుడు ఎక్కువ‌గా తింటున్నారు. అందుకు కార‌ణం ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. అయితే కేవ‌లం డెంగీ అనే కాదు, కివీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం.

kiwi

నేత్ర‌వ్యాధుల‌కు…
రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తాయి.

క్యాన్స‌ర్లు రావు…
శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు…
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

ఇన్‌ఫెక్ష‌న్లు, అనారోగ్యాలు దూరం…
రక్త సరఫరా మెరుగుపడుతుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగిస్తుంది. పిల్లలకు కనీసం వారానికి ఒక సారి కివీ పండ్లను ఇస్తే దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచేలా చేయవచ్చు.

గుండె జ‌బ్బుల‌కు…
గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

మ‌ధుమేహానికి, అధిక బ‌రువుకు…
రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

పురుషుల ఆరోగ్యానికి…
కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top