సినిమాల్లో అంతమందికి ముద్దు పెడతావు…నాకో ముద్దివ్వని ఓ అభిమాని అడిగాడు..! ఆదా శర్మ ఏమని కౌంటర్ ఇచ్చిందో తెలుసా?

సెలబ్రిటీలు అన్నాక అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. ఏదో ఒక విషయంలో జనాలకు దొరికిపోతారు. దీంతో అప్పుడు వాళ్లు ఎదుర్కొనే టార్చర్‌ మామూలుగా ఉండదు. ఇక వివాదం మరీ శృతి మించితే సెలబ్రిటీలు ఇబ్బందుల్లో పడిపోతారు. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులనే ఇప్పుడు నటి అదా శర్మ ఎదుర్కొంటోంది. అవునూ.. ఇంతకీ ఆవిడకు ఇప్పుడు సినిమాలు లేవు కదా.. మరి ఇప్పుడామె గురించి కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది..? అంటే.. అవును, అవుతోంది. అది ముద్దు విషయంలో..! ఏంటీ షాకయ్యారా.. అవునండీ.. మీరు షాకైనా మేం చెబుతోంది నిజమే. అదా శర్మను ఓ అభిమాని ముద్దు అడిగాడు, తరువాత ఏమైందంటే…

ఈ మధ్యే నటి అదా శర్మ ముంబై నుంచి గోవా వెళ్తూ ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్‌ కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో ఆమె సోషల్‌ మీడియాలో తన అకౌంట్‌ ద్వారా లైవ్‌లోకి వచ్చింది. అయితే అలా ఆమె తన అభిమానులతో లైవ్‌ ఇంటరాక్షన్‌ అవుతున్న సమయంలో ఒక అభిమాని అదా శర్మను ముద్దు అడిగాడు. దీంతో అదా శర్మ అందుకు నో చెప్పింది. అందుకు అతను స్పందిస్తూ.. సినిమాల్లో నువ్వు చాలా మందిని ముద్దు పెట్టుకున్నావు కదా, మరి నాకు ముద్దు పెట్టడానికి నీకు అభ్యంతరం ఏముంది, పైగా నాకు లిప్‌ కిస్‌ ఇవ్వాల్సిన పనిలేదు, బుగ్గపై ముద్దు పెడితే చాలు, నన్ను ఓ తండ్రి, ఓ సోదరుడు అనుకుని ముద్దు పెట్టు అని ఆ వ్యక్తి అడిగాడు. అయితే ఇందుకు అదా శర్మ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో వరుస ట్వీట్లు పెట్టింది.

తాను సినిమాల్లో ముద్దు పెట్టిన వాస్తవమే అయినా, అది సినిమా అని, రియల్‌ లైఫ్‌ వేరే అని అదా శర్మ ట్వీట్‌ చేసింది. సినిమాలకు, రియల్‌లైఫ్‌కు సంబంధం ఉండదని, సినిమాల్లో నటించాలి కాబట్టి అవసరం మేరకు సీన్‌ డిమాండ్‌ దృష్ట్యా ముద్దు పెట్టుకుంటామని, కానీ రియల్‌ లైఫ్‌లో తాను ప్రేమించే వారికే ముద్దు పెడతానని అదా చెప్పింది. అసలు సినిమాలకు, రియల్‌ లైఫ్‌కు ఎలా ముడిపెడతారు, అది కరెక్ట్‌ కాదు, నన్ను ముద్దు అడిగిన వ్యక్తికి నిజంగా అంత పవర్‌ ఉంటే అతన్ని నేను చెప్పలేని చోట తన్నేదాన్ని, నేను ఇచ్చే కిక్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి, అసలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని ముద్దు అడిగితే అతన్ని చెంపపై చెళ్లుమనిపించేలా కొట్టాలి… అంటూ అదా శర్మ వరుసగా ట్వీట్లు పెట్టింది.

అయితే అదా శర్మ ట్వీట్లను మాత్రం జనాలు పాజిటివ్‌గా తీసుకోలేదు. ఆమెను విమర్శించారు. ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు ఆమెపై విమర్శనాస్త్రాలను సంధించారు. అదా శర్మ బాగా పొగరుగా మాట్లాడుతుందని, అందుకే ఆమెకు అవకాశాలు రావడం లేదని, అసలు ఒక డబ్బున్న వ్యక్తి ముద్దు అడిగితే అప్పుడు అదా శర్మ అతన్ని అలాగే తంతుదా ?, ఆమె ఓ నీచమైన మహిళ.. అని నెటిజన్లు అదా శర్మను విమర్శించారు. అయితే ఇందుకు మళ్లీ అదా శర్మ స్పందిస్తూ… తాను ఇక ఈ వివాదంలోకి మరింత లోతుగా వెళ్లదలుచుకోలేదని, ఇకనైనా ఈ కాంట్రవర్సీ అయిపోతే బాగుంటుందని కోరుకుంటున్నానని తెలిపింది. ఏది ఏమైనా… ఇలాంటి వివాదాలు తారలకు మామూలే కదా..!

Comments

comments

Share this post

scroll to top